నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మంగళవారం నెల్లూరులో నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పరిశ్రమల స్థాపన కోసం వడ్డీ లేని రుణాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడేమో ఎస్టీ కార్పొరేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఆరోపించారు. గిరిజన సంక్షేమం కోసం కమిటీ వేయకుండా కాలయాపన చేస్తున్నారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.