సాక్షి, అమరావతి: ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాచైతన్య యాత్ర చేపట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు యాత్రను తాము అడ్డుకుంటున్నామన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే టీడీపీ తోకను కత్తిరించారని ఎద్దేవా చేశారు. మార్టూరు సభలో 108 అంబులెన్స్‌కు దారి ఇవ్వని సంస్కృతి చంద్రబాబుదని దుయ్యబట్టారు.
రోజుకో డ్రామాతో నాటకాలా?
తన వ్యక్తిగత మాజీ కార్యదర్శి అక్రమాల ఆరోపణలపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాబు పీఎస్‌ను పట్టుకుంటేనే రూ. 2 వేల కోట్ల అక్రమాలు బయటపడ్డాయని అన్నారు. పెన్షన్లపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, పార్టీలకు అతీతంగా తమ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందని స్పష్టం చేవారు. ఎల్లోమీడియాతో కలిసి శవ రాజకీయాలు చేస్తున్నారని, రోజుకో డ్రామాతో చంద్రబాబు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. డబ్బులు ఖర్చుపెట్టి అధికారం చేజిక్కించుకోవాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారని, ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ అవినీతిరహిత పాలన అందిస్తున్నారని, చంద్రబాబు ఎన్ని యాత్రలు చేసినా ఒరిగేది ఏమీ లేదని అంబటి రాంబాబు అన్నారు. (చదవండి: ఐటీ గుప్పిట్లో బిగ్‌బాస్ గుట్టు!)
ఏంటయ్యా నీ బాధ?
మద్యం ధరలపై సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని అంబటి ధ్వజమెత్తారు. ‘అన్ని బ్రాండ్ లు దొరకడం లేదట. మద్యం ధర పెరిగిందట. ఏంటయ్యా నీ బాధ నువ్వు చెప్పాల్సింది మద్యం తాగవద్దని. మద్యం మాన్పించాలని మేము కొత్త పాలసీ మేము తెస్తే జనం తాగలేకపోతున్నారని ఆయన బాధ పడుతున్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మద్యం సరఫరా నివారణకు చట్టం చేస్తే అది మంచిది కాదని అంటాడు. మద్యం, డబ్బు ప్రభావం ఎన్నికలపై పడకూడదని మంచి ఉద్దేశంతో జగన్ గారు కృషి చేస్తున్నారు. దానికి కూడా చంద్రబాబు గగ్గోలు పెడుతున్నార’ని అంబటి అన్నారు.
ప్రతిపక్షనేత కాదు.. పనికిమాలిన నేత: ఆర్కే రోజా
Comments
Please login to add a commentAdd a comment