
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి
ఆత్మకూరు(పరకాల) : ఉనికికోసమే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరాటపడుతున్నాడని, కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని తన నివాసగృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరకాలలో కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర విఫలమైందన్నారు. స్టేజీ మీదనే కాంగ్రెస్ టికెట్ల కొట్లాట కనిపించిందని, ప్రతిపక్ష పాత్ర పోషించలేని ఆ పార్టీ నాయకులకు ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయిలేదన్నారు.
తన నియోజకవర్గంలో పనిచేయని ఓ కాంగ్రెస్ నాయకుడు పరకాల సెగ్మెంట్‌లో ఓ అభ్యర్థిని తయారుచేయడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. అసెంబ్లీలో రౌడీయిజం చేసిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే ముఖ్యమంత్రి, స్పీకర్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. పరకాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలకు దిగుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. భూరికార్డుల సమగ్రంగా ప్రక్షాళన చేసి రైతులకు పెట్టుబడులు ఇవ్వడానికి సిద్ధమవుతుంటే మింగుడుపడక విమర్శలు చేస్తున్నారని, వారికి ప్రజలు తగినబుద్ధి చెబుతారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment