నేడు కాంగ్రెస్‌ బస్సుయాత్ర | Today Congress Bus Yatra In Mahabubabad | Sakshi
Sakshi News home page

నేడు కాంగ్రెస్‌ బస్సుయాత్ర

Published Sun, Apr 8 2018 9:36 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Today Congress Bus Yatra In Mahabubabad - Sakshi

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు

మహబూబాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర ఆదివారం మానుకోటకు చేరుతుంది. మద్యాహ్నం 2 గంటలకు మరిపెడలో ప్రా రంభమై సాయంత్రం 6గంటలకు మానుకోటకు చేరుకుంటుంది. జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహణకు కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 25వేల జన సమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. యాత్ర మరిపెడ నుంచి కురవి మీదుగా జిల్లా కేంద్రంలో ఆర్‌ఓబీ, స్టేషన్‌ రోడ్, బస్టాండ్‌ రోడ్‌ నుంచి ఎన్టీఆర్‌ స్టేడియానికి చేరుతుంది.

ఈ మేరకు స్టేడియంలో వేదిక నిర్మాణం, ఇతర ఏర్పాట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ భూక్యా ఉమ, జడ్పీటీసీ మూలగుండ్ల వెంకన్న, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గుగులోత్‌ సుచిత్ర, పార్టీ పట్టణ అధ్యక్షుడు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సంద వీరన్న, నాయకులు చుక్కల ఉదయ్‌చందర్, ప్రసాద్, దస్రునాయక్, ఉప్పల వంశీ ఏర్పాట్లను పరిశీలించారు. వారు మాట్లాడుతూ యాత్రకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బట్టి విక్రమార్క, పార్టీ ప్రతిపక్షనేత జానారెడ్డి, రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, జయపాల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరవుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మానుకోటపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement