అంతర్జాతీయ హక్కుల దినోత్సవం
నేడు అంతర్జాతీయ హక్కుల దినోత్సవం. ప్రపంచమంతటా పౌరుల ప్రాథమిక హక్కు ల పరిరక్షణను ఇది ఎలుగెత్తిచాటుతోంది. ఈ ప్రపంచంలో నివసించే ప్రజలందరికీ ఈ ‘అం తర్జాతీయ మానవ హక్కుల ప్రకటన వర్తి స్తుంది. క్రీ.శ.1215లో ఇంగ్లండ్ అప్పటి రాజు జాన్ విడుదల చేసిన ‘మాగ్నా కార్టా’ మొట్టమొ దటి మానవ హక్కుల ప్రకటనగా భావించ వచ్చు. ‘‘న్యాయబద్ధమైన తీర్పు ద్వారా తప్ప, మరేవిధమైన పద్ధతులలోనూ పౌరుల స్వేచ్ఛ ను బందీ చేయడం-బహిష్కరించడం నిషే దం’’ అంటూ ‘మాగ్నా కార్టా’ స్పష్టం చేసింది. ప్రపంచ విప్లవాలకు ఇది నాందీ ప్రస్థావనగా భావించవచ్చు. 1948 డిసెంబర్ నెల 10వ తేదీన ఏర్పడిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలోనే ‘‘అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం’’ తీర్మానం రూపొందిం చారు. ‘భారత రాజ్యాంగం’లోని ప్రాథమిక హక్కులన్నీ దీని నుంచి రూపొందినవే. ఈ స్ఫూర్తితోనే వివిధ దేశాలలో ‘మానవ హక్కుల కమిషన్’లు ఏర్పడ్డాయి. వీటికి పౌరులపట్ల రాజ్యం, వ్యక్తులు సాగిస్తున్న ‘అణచి వేత’ను ప్రశ్నించి, శిక్షించే అధికార ముంటుంది. మానవ హక్కుల కమి షన్‌లు ఇచ్చే తీర్పులు, ఆయా ప్రభు త్వాలు పాటించవలసి ఉన్నా. ఇప్పుడవి అమలు కావడం లేదు.
మన దేశంలో 1993లో రూ పొందిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1994 జనవరి 8 నుండి అమలులోకివచ్చింది. రాష్ట్ర స్థాయిలలో కూడా మానవ హక్కుల కమి షన్‌లకు ఏర్పాటు చేయాలని సూచించినా దేశంలో కొన్ని రాష్ట్రాలకు మానవ హక్కుల కమిషన్‌లు లేవు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌లే స్వయంగా విచారణ జరిపించే వ్య వస్థ ఉండాలి తప్ప, ఇప్పటికే ఉన్న ‘విచారణ అధికారుల’ మీద ఆధారపడటంతో బాధితు లకు న్యాయం జరగడంలేదు. కిందిస్థా యిలో పోలీసు అధికారుల అమానుష ప్రవర్తనపై ఫిర్యాదుచేస్తే, మళ్లీ వారిపై అధికారినే ‘విచార ణాధికారి’గా నియమించడంతో విచా రణ లోపభూయిష్టంగా ఉన్నది.
దేశంలో పోలీసు అధికారులు ప్రజలతో వ్యవహరిస్తున్న తీరు రా జ్యాంగ హక్కులనూ, అంతర్జాతీయ సూత్రాలనూ ఉల్లంఘిస్తున్నది. కేవ లం పాలకులను రక్షించడానికే తాము న్నట్లు ప్రవర్తిస్తున్నారు. ‘పోలీస్‌కస్టడీ’లో జరు గుతున్న మరణాలపట్ల జాతీయ మానవ హక్కుల కమిషన్ చేసిన మార్గదర్శక సూత్రాల ను పోలీసు అధికారులు ఏ మాత్రం పాటించ డంలేదు. అక్రమ కేసులలో నిర్బంధించడం, అక్రమ కేసులు బనాయించడం మానవ హక్కు ల ఉల్లంఘనలో భాగమే. ‘మానవ హక్కులు’ జైలులోని విచారణ ఖైదీలకూ, శిక్షపడిన ఖైదీ లకూ కూడా వర్తిస్తాయని చెబుతున్నప్పటికీ, అధికారులు ఏ మాత్రం పాటించడం లేదు.
‘అధికారం’లో ఉన్న పార్టీల నాయకుల పట్ల, అధికారుల, పోలీసుల వైఖరి ఉదాసీనం గా ఉండటం, సామాన్య పౌరుల పట్ల కఠినం గా ఉంటూ తమ ‘స్వామిభక్తి’ చూపించడం కూడా మానవహక్కుల ఉల్లంఘనే.
‘చట్టం ముందు అందరూ సమానులే’, అనే పాలకుల మాటలు నీటి మూటలని తేట తెల్లమైంది. ప్రజాపోరాటాల ద్వారానే, చరి త్రలో ‘హక్కులు’ సంక్రమించాయి తప్ప అవి పాలకుల ‘భిక్ష’ కాదు. కానీ ప్రస్తుతం ‘హక్కు ల’ ఉల్లంఘన నిత్యం జరుగుతోంది. దీనిని ఎదుర్కోవాలంటే సంఘటిత పోరాటమే ఏకైక మార్గం. అంతర్జాతీయ స్థాయిలో ఎన్ని చట్టా లు వచ్చినప్పటికీ, వాటిని పాటించాల్సిన అధికారులు, పాలక వ్యవస్థ-‘వర్గ దృక్పథం’ తో వ్యవహరించినంతవరకూ, వారిలో పరి వర్తన రాదు.
కావున నిరంతర అప్రమత్తతో పోరా డు తూ మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరా డాలి. అప్పుడే 66 సంవత్సరాల మానవ హక్కుల ప్రకటన లక్ష్యం నెరవేరిన ట్లవుతుంది.
జాన్ బర్నబాస్ చిమ్మె
(ఓపీడీఆర్) రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి