బాధితులకు సత్వర న్యాయం చేయాలి
ఆత్మకూరు(అనుమసముద్రంపేట) : అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయాన్ని సకాలంలో అందించేందుకు అధికారులు కషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ హక్కుల సంఘం కన్వీనర్ చిట్టిబాబు అన్నారు. ఆత్మకూరు మండలంలోని ఏపీ ప్రోడక్టివిటీ కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం నూతన ఎస్సీ, ఎస్టీ చట్టాలపై ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ చట్టం తెలియక పలువురు బాధితులు ఇబ్బందిపడుతున్నారని, ఈ నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. జిల్లా కన్వీనర్ పెంచలనరసయ్య, ఆత్మకూరు నాయకులు వాగాల శ్రీహరి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జి.లక్ష్మీపతి, మానిటరింగ్, విజిలెన్స్ కమిటీ సభ్యులు దావా పెంచలరావు, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్ జె.వెంకట్ పాల్గొన్నారు.