► దివ్యాంగులకు ప్రత్యేక చట్టం కావాలని డిమాండ్
► గవర్నర్ కార్యదర్శికి వినతి పత్రం
సాక్షి, చెన్నై: హక్కుల పరిరక్షణ కోసం దివ్యాంగుల సంఘాలన్నీ ఏకం అయ్యారుు. దివ్యాంగుల ఐక్యకార్యాచరణ సమాఖ్యగా ముందుకు సాగే పనిలో పడ్డారు. తమ హక్కుల సాధనలో భాగంగా తీసుకొచ్చిన చట్టంలో సాగిన సవరణలను బహిర్గతం చేయాలని, అమల్లో కేంద్రం వైఖరి ఏమిటో?, పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందుకు ఆ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పోరుబాటకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా సోమవారం దివ్యాంగుల సంఘాలన్నీ ఏకమై మహార్యాలీగా రాజ్ భవన్ వైపు కదిలేందుకు నిర్ణరుుంచారుు. సైదా పేట కోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో దివ్యాంగులు ఉదయం చేరుకున్నారు.
అక్కడి నుంచి ర్యాలీగా ముందుకు కదిలారు. రాజ్ భవన్‌లో గవర్నర్‌కు వినతి పత్రం అందించేందుకు తగ్గట్టుగా ముందస్తు అనుమతిని దివ్యాంగుల సంఘాల నాయకులు కోరి ఉండడంతో, పోలీసులు వారిని అడ్డుకోలేదు. పోలీసులు భద్రతా ఏర్పాట్లతో పాటుగా, ట్రాఫిక్ కష్టాలు ఎదురు కాని రీతిలో చర్యలు తీసుకున్నారు. దీంతో ర్యాలీగా రాజ్ భవన్‌కు చేరుకున్న దివ్యాంగుల ప్రతినిధుల్ని మాత్రం లోనికి అనుమతించారు. అక్కడ గవర్నర్(ఇన్) విద్యాసాగర్‌రావు కార్యదర్శి రమేష్ చంద్ మీనాకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో తమిళనాడు దివ్యాంగుల హక్కుల సాధన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఝాన్సీరాణి, ఎస్.నంబురాజన్ మాట్లాడుతూ 1995లో దివ్యాంగుల హక్కుల కోసం అమల్లోకి తెచ్చిన చట్టానికి బదులుగా 2007లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.
2014లో పార్లమెంట్ ముందుకు ఈ చట్టం రాగా, యూఎన్ కన్వెన్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో సవరణలకు చర్యలు తీసుకున్నారని వివరించారు. పార్లమెంట్ వ్యవహారాల కమిటీ ముందుకు ఆ చట్టం వెళ్లిందని, తదుపరి ఆ చట్టం ఏమైందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్-3 సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టీఎంఎన్ దీపక్, పి.శరవణన్, ఎన్‌ఎఫ్‌బీ ప్రధాన కార్యదర్శి జి.రామమూర్తి, ప్రతినిధి పి.మనోహరన్, టీఎస్‌ఎఫ్‌డీ ప్రధాన కార్యదర్శి వి.స్వామినాథన్, ఇతర సంఘాల నేతలు రాజీవ్ రంజన్, ఆర్.గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.
తమ హక్కుల చట్టం తెచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి చేసే విధంగా చెన్నైలో సోమవారం దివ్యాంగులు మహా ర్యాలీ నిర్వహించారు. రాజ్ భవన్ వరకు సాగిన ఈ ర్యాలీ అనంతరం గవర్నర్ కార్యదర్శి రమేష్ చంద్ మీనాకు దివ్యాంగులు వినతి పత్రం సమర్పించారు.
మహార్యాలీ
Published Tue, Nov 22 2016 3:55 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
Advertisement
Advertisement