physically handicaped
-
దివ్యాంగులు దరఖాస్తు చేసుకోండి
చిలకలపూడి(మచిలీపట్నం): అర్హత కలిగిన దివ్యాంగులు మూడు చక్రాల మోటారు వాహనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని వికలాంగుల సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామకుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండి సదరం ధ్రువీకరణ పత్రంలో 70 శాతం అంతకంటే ఎక్కువ వికలాంగత్వంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. గతంలో సొంత వాహనం ఉండకూడదన్నారు. డిగ్రీ విద్యార్థినీ, విద్యార్థులు, 10వ తరగతి ఉత్తీర్ణులై స్వయం ఉపాధి పథకం, వేతనం పొందుతూ కనీసం సంవత్సరం అనుభవం కలిగి ఉండాలన్నారు. మహిళలకు 50 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 7 శాతం చొప్పున వాహనాలు మంజూరు చేస్తారన్నారు. అర్హతలు ఉన్న వారు ఈ నెల 31వ తేదీలోగా సంబంధిత పత్రాలతో దరఖాస్తును మచిలీపట్నం కలెక్టరేట్ ఆవరణలోని కార్యాలయంలో అందజేయాల్సి ఉందన్నారు. మరిన్ని వివరాల కోసం 08672–252637లో సంప్రదించాలని ఆయన కోరారు. -
క్షేత్రస్థాయిలో దివ్యాంగులను గుర్తించడమే లక్ష్యం
సక్షమ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణంరాజు నిర్మల్‌రూరల్ : క్షేత్రస్థాయిలో ఉన్న దివ్యాంగులకు గుర్తిం చడమే సమదృష్టి క్షమత వికాస్ ఏవం అనుసంధాన్ మం డల్ (సక్షమ్) ప్రధాన లక్ష్యమని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణంరాజు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని విశ్వబ్రాహ్మ ణ సంఘంలో ఆదివారం జిల్లా సమావేశాన్ని నిర్వహిం చారు. పలు మండలాల అధ్యక్షులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సమగ్ర వికాసం కోసం పనిచేసే జాతీయస్థాయి స్వచ్ఛంద సంస్థ సక్షమ్ అని పేర్కొన్నారు. జిల్లాలో మండలాల వారీగా కమిటీలను నియమించి దివ్యాంగుల వివరాలను తెలుసుకుంటామని అన్నారు. విభిన్న ప్రతిభగల దివ్యాంగుల ను గుర్తించి వారికి వర్క్‌షాప్‌లను నిర్వహించి ఉపాధి క ల్పించేందుకు సక్షమ్ కృషిచేస్తుందని తెలిపారు. జనవరి 4న లూయిబ్రెయిలీ జయంతిని స్థానిక టీన్ జీవో భవన్ లో నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్ర చార ప్రముఖ్ పి.బాలకృష్ణ, మండల అధ్యక్షుడు కత్రోజి అశోక్, కార్యదర్శి పంచగుడి మహేశ్, కోశాధికారి రాం దాస్, సభ్యులు మోహన్ దాస్, సట్ల లక్ష్మణ్, భూమేశ్, వివిధ మండలాల నూతన అధ్యక్షులు పాల్గొన్నారు. మండల కార్యవర్గం కార్యక్రమంలో సంక్షమ్ మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.మండల అధ్యక్షులుగా సట్ల లక్ష్మణ్(భైంసా), పి.శ్యామ్(తానూర్), ఎం.సుధాకర్(లోకే శ్వరం), ఎస్.మారుతి(దిలావర్పూర్), ఎస్.సాయన్న(సారంగపూర్), డి.సాయన్న(నర్సాపూర్), డాక్టర్ వినోద్(సోన్), సాయినా«థ్(ముధోల్), ఐ.రవి(లక్ష్మణచాంద), సురేశ్(మామడ), ప్రసాద్‌గౌడ్(కడెం), డాక్టర్ రాము(దస్తురాబాద్)లను ఎన్నుకున్నారు. -
మహార్యాలీ
► దివ్యాంగులకు ప్రత్యేక చట్టం కావాలని డిమాండ్ ► గవర్నర్ కార్యదర్శికి వినతి పత్రం సాక్షి, చెన్నై: హక్కుల పరిరక్షణ కోసం దివ్యాంగుల సంఘాలన్నీ ఏకం అయ్యారుు. దివ్యాంగుల ఐక్యకార్యాచరణ సమాఖ్యగా ముందుకు సాగే పనిలో పడ్డారు. తమ హక్కుల సాధనలో భాగంగా తీసుకొచ్చిన చట్టంలో సాగిన సవరణలను బహిర్గతం చేయాలని, అమల్లో కేంద్రం వైఖరి ఏమిటో?, పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందుకు ఆ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పోరుబాటకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా సోమవారం దివ్యాంగుల సంఘాలన్నీ ఏకమై మహార్యాలీగా రాజ్ భవన్ వైపు కదిలేందుకు నిర్ణరుుంచారుు. సైదా పేట కోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో దివ్యాంగులు ఉదయం చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా ముందుకు కదిలారు. రాజ్ భవన్లో గవర్నర్‌కు వినతి పత్రం అందించేందుకు తగ్గట్టుగా ముందస్తు అనుమతిని దివ్యాంగుల సంఘాల నాయకులు కోరి ఉండడంతో, పోలీసులు వారిని అడ్డుకోలేదు. పోలీసులు భద్రతా ఏర్పాట్లతో పాటుగా, ట్రాఫిక్ కష్టాలు ఎదురు కాని రీతిలో చర్యలు తీసుకున్నారు. దీంతో ర్యాలీగా రాజ్ భవన్‌కు చేరుకున్న దివ్యాంగుల ప్రతినిధుల్ని మాత్రం లోనికి అనుమతించారు. అక్కడ గవర్నర్(ఇన్) విద్యాసాగర్‌రావు కార్యదర్శి రమేష్ చంద్ మీనాకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో తమిళనాడు దివ్యాంగుల హక్కుల సాధన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఝాన్సీరాణి, ఎస్.నంబురాజన్ మాట్లాడుతూ 1995లో దివ్యాంగుల హక్కుల కోసం అమల్లోకి తెచ్చిన చట్టానికి బదులుగా 2007లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. 2014లో పార్లమెంట్ ముందుకు ఈ చట్టం రాగా, యూఎన్ కన్వెన్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో సవరణలకు చర్యలు తీసుకున్నారని వివరించారు. పార్లమెంట్ వ్యవహారాల కమిటీ ముందుకు ఆ చట్టం వెళ్లిందని, తదుపరి ఆ చట్టం ఏమైందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్-3 సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టీఎంఎన్ దీపక్, పి.శరవణన్, ఎన్‌ఎఫ్‌బీ ప్రధాన కార్యదర్శి జి.రామమూర్తి, ప్రతినిధి పి.మనోహరన్, టీఎస్ఎఫ్డీ ప్రధాన కార్యదర్శి వి.స్వామినాథన్, ఇతర సంఘాల నేతలు రాజీవ్ రంజన్, ఆర్.గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. తమ హక్కుల చట్టం తెచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి చేసే విధంగా చెన్నైలో సోమవారం దివ్యాంగులు మహా ర్యాలీ నిర్వహించారు. రాజ్ భవన్ వరకు సాగిన ఈ ర్యాలీ అనంతరం గవర్నర్ కార్యదర్శి రమేష్ చంద్ మీనాకు దివ్యాంగులు వినతి పత్రం సమర్పించారు.