
చిలకలపూడి(మచిలీపట్నం): అర్హత కలిగిన దివ్యాంగులు మూడు చక్రాల మోటారు వాహనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని వికలాంగుల సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామకుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండి సదరం ధ్రువీకరణ పత్రంలో 70 శాతం అంతకంటే ఎక్కువ వికలాంగత్వంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.
గతంలో సొంత వాహనం ఉండకూడదన్నారు. డిగ్రీ విద్యార్థినీ, విద్యార్థులు, 10వ తరగతి ఉత్తీర్ణులై స్వయం ఉపాధి పథకం, వేతనం పొందుతూ కనీసం సంవత్సరం అనుభవం కలిగి ఉండాలన్నారు. మహిళలకు 50 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 7 శాతం చొప్పున వాహనాలు మంజూరు చేస్తారన్నారు. అర్హతలు ఉన్న వారు ఈ నెల 31వ తేదీలోగా సంబంధిత పత్రాలతో దరఖాస్తును మచిలీపట్నం కలెక్టరేట్ ఆవరణలోని కార్యాలయంలో అందజేయాల్సి ఉందన్నారు. మరిన్ని వివరాల కోసం 08672–252637లో సంప్రదించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment