సాక్షి, విజయవాడ: వరద బాధితులకు ఎండీయూ వాహనాలు అండగా నిలుస్తున్నాయి. అందులోనే ఆహారం, మంచినీరును చంద్రబాబు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎండీయూ వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో చౌక డిపోల దగ్గర వేచిచూసే పని లేకుండా ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల దగ్గరకే వైఎస్ జగన్ రేషన్ పంపిణీ చేయించారు. సీఎం అయ్యాక ఆ వాహనాలను చంద్రబాబు పక్కన పెట్టించారు. ఇప్పుడు వరద బాధితుల కోసం కూటమి ప్రభుత్వానికి అవే వాహనాలు దిక్కు అయ్యాయి. ఇరుకు మార్గంలో కూడా వెళ్లి ఆహారం నీళ్లు అందించటానికి ఎండీయూ వాహనాలు ఉపయోగపడుతున్నాయి.
అయితే, వాహనాల వాడకంలోనూ చంద్రబాబు ప్రభుత్వం కుటిల రాజకీయం చేసింది. వాహనాలపై ఉన్న వైఎస్ జగన్ ఫోటోలు కనపడకుండా స్టిక్కర్లను అంటించిన అధికారులు.. జగన్ పేరు ఉన్న చోట ఏకంగా స్టిక్కర్లను చించివేశారు. నిన్నటి వరకు వాలంటీర్లను పక్కన పెట్టిన చంద్రబాబు.. నేడు వరద సహాయక చర్యల కోసం వాలంటీర్లను పిలుస్తున్నారు. ఆహారం సరఫరా కోసం ఎండీయూ వాహనాల వాడకం.. వైఎస్ జగన్ ముందు చూపు కార్యక్రమాలే చంద్రబాబుకు దిక్కయ్యాయని స్థానికులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment