
ప్రభాస్ 'సాహో'కు భారీ ఆఫర్!
బాహుబలి సినిమా ప్రభాస్ తదుపరి చిత్రం 'సాహో'పై భారీ అంచనాలను పెంచేసింది.
బాహుబలి సినిమా ప్రభాస్ తదుపరి చిత్రం 'సాహో'పై భారీ అంచనాలను పెంచేసింది. ఎంతలా అంటే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి స్ధాయిలో ప్రారంభం కాకముందే సినిమా దేశవ్యాప్త హక్కుల కోసం ఓ బాలీవుడ్ బడా సంస్ధ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్స్ కోసం రూ.400 కోట్ల మొత్తాన్ని ఆ సంస్ధ ఆఫర్ చేసినట్లు వినికిడి. ప్రభాస్ తదుపరి చిత్రానికి ఇంత భారీ ఆఫర్ రావడాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
కాగా, సాహోలో కథనాయిక పాత్రకు కొందరు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఎహసాన్ లాయ్ స్వరాలు సమకూరుస్తున్నారు.