Chiyaan Vikram Birthday Special Thangalaan making video Released Today - Sakshi
Sakshi News home page

ఊర మాస్‌ లుక్‌లో స్టార్‌ హీరో.. మేకింగ్ వీడియో చూశారా?

Published Mon, Apr 17 2023 1:48 PM | Last Updated on Mon, Apr 17 2023 2:14 PM

Vikram Birthday Special Thangalaan making video Released Today - Sakshi

తమిళ స్టార్ హీరో విక్రమ్ దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్‌లో ఆయన నటించారు. విక్రమ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'తంగలాన్'. ఈ చిత్రానికి పీఏ రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పార్వతి, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌ రాజా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగాజరుగుతోంది. కోలార్ బంగారు గనుల కార్మికుల జీవితాల చుట్టూ తిరిగే నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నారు. ఇవాళ విక్రమ్ బర్త్‌ డే సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌ డేట్‌ ఇచ్చారు. తంగలాన్ ఈ చిత్రం నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఇటీవల విడుదల చేసిన విక్రమ్ లుక్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. 

పాత్ర ఏదైనా సరే చియాన్ విక్రమ్ పరకాయ ప్రవేశం చేస్తాడు. విభిన్న పాత్రల్లో ఒక్కడే అదరగొట్టేస్తాడు. గతంలో కోబ్రా సినిమాలో పది రకాల పాత్రలతో మెప్పించాడు. తాజాగా రిలీజ్ తంగలాన్ చేసిన మేకింగ్ వీడియోలో విక్రమ్‌ లుక్‌ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదెక్కడి మాస్ లుక్‌ రా మావ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పక్కా మాస్‌ లుక్‌తో విక్రమ్ అతి భయంకరంగా కనిపించారు. మేకింగ్ వీడియోనే ఆ రేంజ్‌లో ఉంటే ఇక సినిమాపై ఏలా ఉంటుందోనని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీడియో చివర్లో వచ్చే సీన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. త్వరలోనే ఆయన నటించిన పొన్నియిన్ సెల్వన్-2 రిలీజ్ కాబోతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ దీనిని విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement