సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.11,400 కోట్ల కుంభకోణం కేసు దర్యాప్తులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన విలువైన ఆస్తులను, ఇతర సామగ్రిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంటోంది. అయితే ఈ మెగా స్కాంలో ప్రధాన నిందితుడు మోదీ భారీ ఎత్తున సేకరించిన విదేశీ గడియారాలను చూసి ఈడీ అధికారులే విస్తుపోయారు. వీటితోపాటు రూ.30కోట్ల మిగులు ఉన్న బ్యాంకు ఖాతాలను, రూ.13.86కోట్ల విలువైన షేర్లను సీజ్ చేసింది.
తాజా సోదాల్లో పెద్ద మొత్తంలో విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న కళ్లు చెదిరే గడియారాలను అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.176 స్టీల్ అల్మరాలు, 158 పెద్ద బాక్సులు 60 ప్లాస్టిక్ కంటైనర్లలో ఖరీదైన విదేశీ వాచీలను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. కాగా ఒక్క గురువారం నాటి సోదాల్లోనే రూ.100కోట్ల ఆస్తిని స్తంభింప చేసినట్టు అధికారులు ప్రకటించారు. వీటిలో మోదీకి చెందిన రోల్స్ రాయిస్, పోర్షే, బెంజ్ సహా తొమ్మిది లగ్జరీ కార్లు , షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నసంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment