సాక్షి, ముంబై: పీన్‌బీ మెగా కుంభకోణంలో డైమండ్ వర్తకుడు నీరవ్ మోదీ, గీతాజాలీ గ్రూప్ యజమాని మెహల్ చోక్సీ ఈడీ మరో గట్టి షాక్ ఇచ్చింది. మోదీ, అతని కంపెనీకి చెందిన విలువైన కార్లను సీజ్ చేసింది. అలాగే వీరిరువురికి చెందిన షేర్లను, మ్యూచుఫల్ ఫండ్స్‌ను స్థంభింప చేసింది.
11,4 00 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం మోదీకి చెందిన రూ .7.80 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్, షేర్లను ఫ్రీజ్ చేసింది. అలాగే చోక్సి చెందిన 86.72 కోట్ల రూపాయల విలువైన షేర్లను స్తంభింపచేసింది. మోదీకి, కంపెనీకి చెందిన 9లగ్జరి కార్లను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కార్లలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, రెండు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ 250 సిడిఐ, ఒక పోర్షే పనామార, 3 హోండా కార్లు, ఒక టయోటా ఫార్చ్యూనర్ ఒక టయోటా ఇన్నోవా ఉన్నాయి.
కాగా వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను ముంచేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఇప్పటికే పీఎన్‌బీకి చెందిన ఉద్యోగులను అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించింది. అలాగే నీరవ్‌మోదీ సంస్థలు, గీతాంజలి సంస్థలపై కూడా చర్యలకు దిగింది. వీరి ఉద్యోగులను అరెస్ట్ చేసింది. మరోవైపు అత్యుత్సాహంతో బ్యాంకు రికవరీని పరిమితం చేసుకుందంటూ పీఎన్‌బీపై మోదీ ఎదురుదాడికి దిగాడు. అలాగే నీరవ్ విదేశాలకు పారిపోలేదనీ, వ్యాపర పనుల మీద వెళ్లాడంటూ అతని కౌన్సిల్ వాదించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment