1/11
డబ్బు దాయాలంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది బ్యాంకులు. సేవింగ్స్ స్కీమ్‌లు, రికరింగ్ డిపాజిట్లు, ఎఫ్‌డీ.. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌మార్కెట్ షేర్లు, రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు, భవనాలు కొనుగోలు చేయడం.. ఇలా వివిధ మార్గాల్లోనూ డబ్బు దాచుకుంటారు. వీటితోపాటు బాగా డబ్బు సంపాదిస్తున్నవారు ఖరీదైన గడియారాలను కొనుగోలు చేస్తూ వాటిరూపంలో సంపద పోగుచేసుకుంటారు. ప్రముఖ కంపెనీలు లిమిటెడ్ ఎడిషన్‌లో భాగంగా ప్రపంచంలో అరుదుగా చాలా తక్కువ సంఖ్యలో కొన్ని ఖరీదైనా వాచ్‌లను తయారుచేస్తాయి. వాటిని కొనుగోలు చేస్తే భవిష్యత్తులో వాటికి డిమాండ్ పెరిగి కొన్నరేటు కంటే అధికంగా రాబడి వస్తుందని కోటీశ్వరులు నమ్ముతారు. దాంతో ఖరీదైన గడియారాల రూపంలో సంపదను దాచుకుంటారు.
2/11
గ్రాఫ్ డైమండ్స్ హాలూసినేషన్, ధర: రూ.458 కోట్లు ఉపయోగించిన పదార్థం: ప్లాటినం తయారీ సంవత్సరం: 2014 ప్లాటినమ్ బ్రాస్‌లెట్‌తో ఉన్న ఈ గడియారాన్ని 110 క్యారెట్ల విభిన్న రంగులతో కూడిన వజ్రాలతో తయారుచేశారు.
3/11
గ్రాఫ్ డైమండ్స్ ది ఫాసినేషన్, ధర: రూ.333 కోట్లు ఉపయోగించిన పదార్థం: డైమండ్ తయారీ సంవత్సరం: 2015 152.96 క్యారెట్ల తెల్లని వజ్రాలను కలిగి అరుదైన 38.13 క్యారెట్ల వజ్రం సెంట్రల్ డయల్‌గా పనిచేస్తుంది
4/11
పటేక్ ఫిలిప్ గ్రాండ్‌మాస్టర్ చైమ్ రెఫ్. 6300A-010, ధర: రూ.258 కోట్లు ఉపయోగించిన పదార్థం: తెలుపు బంగారం తయారీ సంవత్సరం: 2019
5/11
బ్రెగ్యుట్ గ్రాండే కాంప్లికేషన్ మేరీ ఆంటోయినెట్, ధర:రూ. 250 కోట్లు ఉపయోగించిన పదార్థం: బంగారం తయారీ సంవత్సరం: 1827 ఫ్రెంచ్ రాణి మేరీ ఆంటోయినెట్ కోసం దీన్ని తయారుచేశారని నమ్ముతారు. 1900 చివరలో ఈ గడియారాన్ని కొందరు దుండగులు దొంగలిచారు. ప్రస్తుతం ఇది ఎల్‌ఏ మేయర్ మ్యూజియంలో ఉంది.
6/11
జేగర్-లెకౌల్ట్రే జోయిలెరీ 101 మాన్చెట్, ధర: రూ.216 కోట్లు ఉపయోగించిన పదార్థం: తెలుపు బంగారం తయారీ సంవత్సరం: 2012 777 వజ్రాలను ఇందులో అమర్చారు.
7/11
చోపార్డ్ 201- క్యారెట్, ధర: రూ.208 కోట్లు ఉపయోగించిన పదార్థం: తెలుపు, పసుపు బంగారం తయారీ సంవత్సరం: 2000 ఇది స్ప్రింగ్ లోడెడ్ మెకానిజమ్‌తో పని చేస్తుంది. సమయం తెలుసుకునేందుకు దానిపై నొక్కినప్పుడు మూడు గుండె ఆకారపు వజ్రాలు (15-క్యారెట్ గులాబీ రంగు, 12-క్యారెట్ నీలం రంగు, 11-క్యారెట్ తెలుపు రంగు) పూల రేకుల్లా విచ్చుకుంటాయి.
8/11
పటేక్ ఫిలిప్ హెన్రీ గ్రేవ్స్ సూపర్ కాంప్లికేషన్, ధర: రూ.200 కోట్లు ఉపయోగించిన పదార్థం: బంగారం తయారీ సంవత్సరం: 1932
9/11
రోలెక్స్ పాల్ న్యూమన్ డేటోనా రెఫ్ 6239, ధర: రూ.155 కోట్లు ఉపయోగించిన మెటీరియల్: స్టెయిన్లెస్ స్టీల్ తయారీ సంవత్సరం: 1968
10/11
జాకబ్ & కో.బిలియనీర్ వాచ్, ధర: రూ.150 కోట్లు ఉపయోగించిన పదార్థం: తెలుపు బంగారం తయారీ సంవత్సరం: 2015
11/11
పటేక్ ఫిలిప్ స్టెయిన్లెస్ స్టీల్ రెఫ్ 1518, ధర: రూ.100 కోట్లు ఉపయోగించిన మెటీరియల్: స్టెయిన్లెస్ స్టీల్ తయారీ సంవత్సరం: 1943