బాలీవుడ్‌లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి | Priyamani Comments About Bollywood Paparazzi | Sakshi
Sakshi News home page

Priyamani: హిందీ సెలబ్రిటీల బండారం రివీల్.. ఓర్ని అసలు సంగతి ఇదా!

Published Tue, Feb 20 2024 3:12 PM | Last Updated on Tue, Feb 20 2024 3:29 PM

Priyamani Comments About Bollywood Paparazzi - Sakshi

నటి ప్రియమణి చాలామందికి తెలియని సీక్రెట్ బయటపెట్టింది. బాలీవుడ్‌లో చాన్నాళ్ల నుంచి జరుగుతున్న ఓ పని వెనక అసలేం జరుగుతుందో మొత్తం బయటపెట్టింది. ఓర్ని అసలు సంగతి ఇదా అని అందరూ అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇంతకీ ప్రియమణి ఏం చెప్పింది? హిందీ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది?

ప్రియమణి.. హీరోయిన్‌గా తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ ఈమెకు అంత పెద్దగా కలిసి రాలేదు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంది. పలు షోల్లో జడ్జిగా చేస్తూ వచ్చింది. అలాంటి టైంలో 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ఈమె ఫేట్ మారిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. ఇలా ఓ వైపు మూవీస్‌లో ముఖ్య పాత్రలు చేస్తూ జోరు మీదుంది. 

(ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో)

ఈ మధ్య కాలంలో జవాన్, నెరు, భామా కలాపం 2 లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి. దీంతో పలు ఇంటర్వ్యూలు, పాడ్ కాస్ట్‌లు ఇస్తూ బిజీగా ఉంది. అలా ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ. బాలీవుడ్‌లో పపరాజీ(ఫొటోలు తీయడం) కల్చర్ బండారం బయటపెట్టింది.

చాలామంది హిందీ హీరోయిన్లు.. జిమ్, విమానాశ్రయం, హోటల్ దగ్గర కనిపిస్తుంటే చాలామంది ఫొటోగ్రాఫర్లు వీళ్ల వెంట పడుతుంటారు కదా. అయితే ఇదంతా సదరు సెలబ్రిటీలు డబ్బులిచ్చి చేయించుంకుంటారని ప్రియమణి చెప్పింది. 'జవాన్' చేసిన తర్వాత ముంబయికి వెళ్తే.. ఓ ఏజెన్సీ వ్యక్తి నాకు కూడా పపరాజీ కల్చర్‌కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందనే ఛార్ట్ పంపించాడని చెప్పింది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న తెలుగు యువ నటి.. ఫొటో వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement