Actress Janhvi Kapoor Trolled For Ignoring Paparazzi: సెలబ్రిటీలు ఏం చేసిన ప్రతిరోజు ఏదో ఒక రకంగా ట్రోలింగ్ గురవుతుంటారు. వారు బాధలో ఉన్న, సంతోషంగా ఉన్న, వేషధారణ, ప్రవర్తన కొంచెం భిన్నంగా కనపడిన నెటిజన్స్ వారి కామెంట్స్‌తో ఆడేసుకుంటారు. వస్త్రధారణ నుంచి యాట్టిట్యూడ్ వరకు విమర్శకులు జడ్జ్ చేయడాన్ని సెలబ్రిటీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటీవల అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య నడకపై ఎన్నో కామెంట్స్ చేశారు నెటిజన్స్. ఆ ట్రోలింగ్‌పై అభిషేక్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. తాజాగా ఈ ట్రోలింగ్ కన్ను అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌పై పడింది.
జాన్వీ కపూర్ తన సోదరి, స్నేహితులతో ఎక్కడికో వెళ్లి రావడం ఫొటోగ్రాఫర్ కెమెరాలకు చిక్కింది. జాన్వీని ఫొటోలకు ఫోజులివ‍్వమని ఫొటోగ్రాఫర్లు అడగ్గా పట్టించుకోకుండా వెళ్లి కారులో కూర్చుందీ దఢక్ హీరోయిన్. ఈ వీడియను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోపై కామెంట్స్ రూపంలో జాన్వీని ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు నెటిజన్స్. 'మేడమ్ యాట్టిట్యూడ్ చూడండి' అంటూ రాసుకొచ్చారు.
ఇటీవల ఫ్యాషన్‌కు సంబంధించిన ఓ వీడియోలో మూడు వేర్వేరు కాస్ట్యూమ్స్ ధరించి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది జాన్వీ. ఆ వీడియో ఏదో బ్యూటీ బ్రాండ్ కోసం జాన్వీ షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన అద్భుతమైన వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతారు. ఇన్‌స్టా గ్రామ్‌లో జాన్వీని ఫాలో అయ్యేవారి సంఖ‍్య 14.4 మిలియన్లు.
Comments
Please login to add a commentAdd a comment