ఫోటో జర్నలిస్టులను పాప్ స్టార్ తప్పించుకోబోయి..
ఫోటో జర్నలిస్టులను తప్పించుకోవాలనే ప్రయత్నంలో సంచలన పాప్ స్టార్ జస్టిన్ బీబర్ స్వల్ప
కారు ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటన బేవెర్లీ హిల్స్ లో చోటు చేసుకుంది.
ఫోటో జర్నలిస్టులను తప్పించుకోవాలనే తొందరలో డ్రైవర్ కారును వెనక్కి తీయగా మరో బీఎండబ్ల్యూ కారును ఢీ కోట్టినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగినపుడు బీబర్ కారు వెనుక సీటులో ఉన్నట్టు సమాచారం.
బెవెర్లీ హిల్స్ లో లోని బౌచోన్ రెస్టారెంట్ వద్ద జరిగినట్టు మీడియాలో కథనం వెల్లడైంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని.. కేసు కూడా నమోద చేయలేదని బెవెర్లీ హిల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. గతంలో వెంటాడుతున్న ఫోటో జర్నలిస్టులను తప్పించుకునే క్రమంలోనే ప్రిన్సెస్ డయానా కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.