ఇరవై ఏళ్ల తర్వాత...! | Tabu And Saif Ali Khan Are Reuniting In Jawaani Jaaneman After 20 years | Sakshi
Sakshi News home page

ఇరవై ఏళ్ల తర్వాత...!

Published Fri, May 10 2019 3:58 AM | Last Updated on Fri, May 10 2019 3:58 AM

Tabu And Saif Ali Khan Are Reuniting In Jawaani Jaaneman After 20 years - Sakshi

సైఫ్‌అలీఖాన్‌, టబు

రెండు దశాబ్దాల కాలచక్రం తర్వాత మళ్లీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు సైఫ్‌ అండ్‌ టబు. ఫిల్మిస్తాన్‌ (2012), మిత్రోం (2018), నోట్‌బుక్‌ (2019) చిత్రాలను తెరకెక్కించిన నితిన్‌ కక్కర్‌ దర్శకత్వంలో ఓ ఫన్‌ అండ్‌ ఫ్యామిలీ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో సైఫ్‌అలీఖాన్‌ హీరోగా నటిస్తున్నారు.

అలియా ఎఫ్‌ అనే కొత్త అమ్మాయి సైఫ్‌ కూతురి పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రంలోనే టబు కూడా ఓ కీలకపాత్ర చేయనున్నారు. 1999లో ‘బివి నం.1, హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ చిత్రాల్లో కలిసి నటించారు సైఫ్‌ అండ్‌ టబు. మళ్లీ దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఈ సినిమాలో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. ‘‘టబుకి కథ వినిపించాం. ఆమెకు నచ్చింది. నటించడానికి ఒప్పుకున్నారు. ఆమె పాత్ర గురించి ఇప్పుడే చెప్పడం సరికాదు. త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తాం. లండన్‌లో 45రోజుల భారీ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశాం ’’ అని చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement