ప్రతిసారి ఇదే ప్రశ్న.. అన్నీ తెలిసి కూడా ఎందుకో?: టబు ఫైర్‌ | Tabu: Why Don't You Ask Male Actor Why You Are Getting Paid More | Sakshi
Sakshi News home page

పోయి వాళ్లనే అడండి.. మమ్మల్నెందుకు అడుగుతున్నారు?: టబు

Published Sat, Aug 3 2024 12:13 PM | Last Updated on Sat, Aug 3 2024 12:25 PM

Tabu: Why Don't You Ask Male Actor Why You Are Getting Paid More

హీరోలకన్నా హీరోయిన్లకు తక్కువ పారితోషికం.. ఇది అందరికీ తెలుసు! అయినా పదే పదే దీని గురించి నటీమణులను గుచ్చిగుచ్చి అడుగుతుంటారు. మీకు హీరోలకన్నా తక్కువ రెమ్యునరేషన్‌ ఇస్తున్నారా? దాని గురించి మీరు అభ్యంతరాలు తెలపరా? అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు. తాజాగా ఆరో మే కహా దమ్‌ తా సినిమా ప్రమోషన్స్‌కు హాజరైన టబుకు మరోసారి ఇదే ప్రశ్న ఎదురైంది.

వెళ్లి వాళ్లను అడగండి
దీంతో అసహనానికి లోనైన ఆమె.. హీరోలకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నవారి దగ్గరకు వెళ్లి ఈ ప్రశ్నలు అడగండి అని ఫైర్‌ అయింది. 'హీరోహీరోయిన్లకు పారితోషికం దగ్గర ఎందుకు వ్యత్యాసం చూపిస్తారని ప్రతి నటిని పట్టుకుని అడుగుతారు. పైగా మగవారికే ఎక్కువ డబ్బు ఇస్తారని, వారికంటే మాకు తక్కువే ముడుతుందని మీకూ తెలుసు. 

పారితోషికం..
అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకని ఆ ప్రశ్నలు అడుగుతారు? వెళ్లి ఆ పారితోషికం ఇచ్చేవారినే అడగండి. దీనికి నేనెలా సమాధానం చెప్తాను. హీరోల కన్నా తక్కువ పారితోషికం ఇవ్వడం నచ్చడం లేదనో లేదా ఇచ్చినదానితోనే సర్దుకుపోతున్నానో చెప్తే దాన్ని సెన్సేషనల్‌ చేయాలనే కదా మీ తాపత్రయం. మీకు ఎందుకు ఎక్కువ ఇస్తున్నారని వెళ్లి హీరోలను అడండి. అప్పుడు ఏం సమాధానాలు వస్తాయో చూద్దాం అంది.

వీరి కాంబినేషన్‌లో 10వ సినిమా
కాగా టబు, అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆరో మే కహా దమ్‌తా. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన 10వ చిత్రమిది. నీరజ్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ మూవీలో జిమ్మీ షెయిర్‌గిల్‌, సాయాజీ షిండే, శాంతను మహేశ్వరి, సాయి మంజ్రేకర్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదలైంది.

చదవండి: Buddy Movie Review: అల్లు శిరీష్‌ 'బడ్డీ' సినిమా రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement