పగ తీరేనా? | Saif Ali Khan Naga Sadhu Look in Laal Kaptaan Out | Sakshi
Sakshi News home page

పగ తీరేనా?

Published Tue, May 21 2019 12:58 AM | Last Updated on Tue, May 21 2019 12:58 AM

Saif Ali Khan Naga Sadhu Look in Laal Kaptaan Out - Sakshi

సైఫ్‌ అలీఖాన్‌

సైఫ్‌ అలీఖాన్‌ తన లేటెస్ట్‌ సినిమా కోసం నాగ సాధువుగా మారారు. నాగ సాధువు ప్రయాణం, పగ, ప్రతీకారం చుట్టూ ఈ కథ సాగనుందట. సైఫ్‌ ముఖ్య పాత్రలో ‘ఎన్‌హెచ్‌ 10’ ఫేమ్‌ నవదీప్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లాల్‌ కెప్టెన్‌’. ఏరోస్‌ సంస్థతో కలసి ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సైఫ్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. అలాగే ‘లాల్‌ కెప్టెన్‌’ను  సెప్టెంబర్‌ 6న రిలీజ్‌ చేస్తున్నటు ప్రకటించారు. ‘‘సైఫ్‌లోని నటుడిని పూర్తిగా వినియోగించుకునే పాత్ర ఇది. ఈ చిత్రం కాన్సెప్ట్‌ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement