‘ఆది పురుష్’ అనే పీరియాడికల్ సినిమాలో నటించనున్నట్లు ఇటీవలే ప్రకటించారు ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర చేయనున్నారు. సైఫ్ అలీఖాన్‌ది రావణుడి పాత్ర. భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటాయట. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఈ సినిమా చిత్రీకరణ మొత్తాన్ని స్టూడియోల్లోనే పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం. ‘300, జంగిల్ బుక్’ వంటి హాలీవుడ్ చిత్రాలను దాదాపు స్టూడియోల్లోనే పూర్తి చేశారు. గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి ‘ఆది పురుష్’ చిత్రీకరణను దాదాపు గ్రీన్ స్క్రీన్‌లోనే జరుపుతారట. దీనికోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులను తీసుకున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ విలు విద్య నేర్చుకుంటున్నారు. తన శరీరాకృతిని కూడా అందుకు తగ్గట్టు మారుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment