ముంబై: హిందీ సినీ పరిశ్రమలో మొన్ననే యువ నటుడు వరుణ్ ధావన్ వివాహం చేసుకోగా తాజాగా సినీ గాయని శిల్పారావు వివాహం చేసుకుంది. తన స్నేహితుడు రితేష్ కృష్ణన్‌ను బుధవారం సాయంత్రం శిల్పారావు పెళ్లాడారు. హిందీ సినీ పరిశ్రమలో పదేళ్లుగా గాయనిగా శిల్పారావు రాణిస్తూ అభిమానులను పెంచుకుంది. తాజాగా తన స్నేహితుడు చేసిన పెళ్లి ప్రతిపాదనను అంగీకరించి వివాహం చేసుకున్నట్లు ఆమె సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తూ తెలిపింది.
కోవిడ్ నేపథ్యంలో ముంబైలో అతికొద్దిమంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో శిల్పారావు ఫొటోలు పంచుకుంది. మా మొదటి సెల్ఫీ అంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. దాంతోపాటు రితేశ్‌తో ఉన్న తన చిన్ననాటి ఫొటోలను షేర్ చేసింది. హే దిల్ హై ముష్కిల్, లవ్ ఆజ్ కల్, బచ్నా హై హసీనా వంటి సినిమాల్లో శిల్పారావు పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment