అప్పుడు ధ్యానం చేస్తా!
‘‘ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. సక్సెస్ అయిన ప్రతి సారీ నా చిత్రాల ఎంపికలో మార్పు వచ్చిందని అంటున్నారు. కానీ అందులో నిజం లేదు. నా మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తాను. ‘లవ్ ఆజ్ కల్ ’ సినిమా తర్వాత నా ఐదు చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అప్పుడే నా కెరీర్ మీద నాకో అవగాహన వచ్చింది. ఎలాంటి సినిమాలు చేయాలి..? నేనెలాంటి పాత్రలు చేయగలను ..? అనే వాటిపై స్పష్టత వచ్చింది.
నాలో మంచి నటి ఉందని ప్రోత్సహించిన దర్శకుడు హోమీ అడజానియా. ఆయన దర్శకత్వంలో నటించిన ‘కాక్‌టైల్’ సినిమా నటిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. అయినా సక్సెస్ అయితేనే విలువ ఉంటుంది. సినిమా ఫ్లాప్ అయిన ప్రతిసారీ విమర్శలు వస్తాయి. సద్విమర్శలను నా కెరీర్‌కు ఉపయోగించుకుంటాను. భరించలేనివైతే మెడిటేషన్ చేసి ఆ ఒత్తిడి తగ్గించుకుంటాను. కొంతమంది ఇలా చేయాలి.. అలా చేయాలి అని ఉచిత సలహాలిస్తారు. కానీ వాటిని పట్టించుకోను’’.
- దీపికా పదుకొనే