
Shubman Gill- Sara Ali Khan: టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పొట్టి ఫార్మాట్‌లో అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. న్యూజిలాండ్ పర్యటన నేపథ్యంలో టీ20 సిరీస్‌కు అతడు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే జట్టుతో కలిసి న్యూజిలాండ్‌కు చేరుకున్నట్లు సమాచారం. వన్డేల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న గిల్... టీ20 తుది జట్టులో చోటు దక్కించుకుని తనను తాను నిరూపించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
ఇదిలా ఉంటే.. 23 ఏళ్ల ఈ యువ బ్యాటర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి గత కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయ సారాతో అతడు డేటింగ్‌లో ఉన్నట్లు వదంతులు వ్యాపించాయి. సోషల్ మీడియాలో వీరిద్దరు ఒకరినొకరు ఫాలో కావడం, ఫొటోలకు పరస్పరం కామెంట్లు చేసుకోవడంతో ఈ రూమర్లు తెర మీదకు వచ్చాయి.
అప్పుడు ఆమె పేరు
ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం గిల్.. ‘‘దేవతలతో ప్రేమలో పడకూడదు’’ అంటూ ఓ పోస్ట్ షేర్ చేయడంతో సారాతో బ్రేకప్ అయిందంటూ గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేశారు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్, పటౌడీ వారసురాలు సారా అలీఖాన్‌తో కలిసి శుబ్‌మన్ డిన్నర్‌కు వెళ్లినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో అతడు సారా ప్రేమలో పడ్డాడంటూ ప్రచారం జోరందుకుంది.
నిజమే చెప్తున్నా
ఈ నేపథ్యంలో ఇటీవల ఓ పంజాబీ చాట్ షోలో పాల్గొన్న గిల్‌కు ఇందుకు సంబంధించి ప్రశ్న ఎదురైంది. మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా అంటూ హోస్ట్ అతడిని ప్రశ్నించారు. సారా కా సారా సచ్ బోలో(సారా గురించి ఉన్నది ఉన్నట్లుగా మొత్తం నిజం చెప్పేయాలి) అనగా.. ఇందుకు బదులుగా.. ‘‘సారా కా సారా సచ్ బోల్ దియా (మొత్తం నిజం చెప్పేశాను) నేను డేటింగ్‌లో ఉండొచ్చు.. ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాడు.
ఇక బాలీవుడ్‌లో అత్యంత ఫిట్‌గా ఉంటే నటి ఎవరు అడగ్గా.. ‘‘సారా’’ అంటూ గిల్ బదులివ్వడం విశేషం. దీంతో గిల్- సారా ప్రేమ నిజమేనని ఈ యువ క్రికెటర్ కన్‌ఫామ్ చేసేశాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 12 వన్డేలు ఆడిన శుబ్‌మన్ గిల్.. 579 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. 11 టెస్టులాడి 579 పరుగులు సాధించాడు.
చదవండి: India tour of New Zealand: టీమిండియా న్యూజిలాండ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు
టీమిండియా కెప్టెన్సీ రేసులో ఎవరూ ఊహించని కొత్త పేరు..?