అప్పుడలా.. ఇప్పుడిలా.. ఎంత మార్పు! | Sara Ali Khan Shares Her Inspiring Weight Loss Journey New Video | Sakshi
Sakshi News home page

అది నువ్వేనా: హీరోయిన్‌ వీడియోకు నెటిజన్లు ఫిదా!

Published Mon, Jun 1 2020 1:27 PM | Last Updated on Mon, Jun 1 2020 2:50 PM

Sara Ali Khan Shares Her Inspiring Weight Loss Journey New Video - Sakshi

పటౌడి పరగణా యువరాణి సారా అలీఖాన్‌ హీరోయిన్‌ కావాలన్న కలను నిజం చేసుకోవడానికి ఎంతో కఠినంగా శ్రమించింది. స్టార్‌ కిడ్‌ అయినప్పటికీ అధిక బరువు కారణంగా తొలుత ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె.. పట్టుదలతో నాజూకుగా తయారై నేడు యువకుల డ్రీమ్‌గర్ల్‌గా మారిపోయింది. హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. నేడు తను ఈ స్థాయికి రావడం వెనుక దాగున్న శ్రమను ప్రతిబింబించే వీడియోను సారా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘‘లాక్‌డౌన్‌ ఎడిషన్‌: సంపూర్ణ సారా నుంచి సగం సారా’’ అంటూ చమత్కారంతో కూడిన క్యాప్షన్‌ జోడించింది. టూర్‌గైడ్‌ ఎపిసోడ్‌లో భాగంగా స్లిమ్‌గా తయారుకావడానికి తాను చేసిన కార్డియో ఎక్సర్‌సైజులు, స్విమ్మింగ్‌, బైక్‌ రైడింగ్‌ తదితర వర్కౌట్లకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది. (మహేష్‌తో జోడీ కుదిరిందా?)

ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 33 లక్షలకు పైగా వ్యూస్‌ రావడం విశేషం. ఈ క్రమంలో.. ‘‘నిజంగా అది నువ్వేనా. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించావు. నీది గొప్ప ప్రయాణం. మాలో స్ఫూర్తిని నింపావు’’ అంటూ నెటిజన్లు 24 ఏళ్ల సారాను కొనియాడుతున్నారు. కాగా బాల్యంలోనే పీసీఓడీ బారిన పడిన కారణంగా సారా చదువుకునే రోజుల్లో దాదాపు 96 కిలోల బరువుతో బొద్దుగా ఉండేవారన్న సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్‌గా వెండితెరపై మెరవాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు జిమ్‌లో తీవ్రంగా శ్రమించి ప్రస్తుత రూపాన్ని పొందారు. కేదార్‌నాథ్‌ సినిమాతో తెరంగేట్రం చేసిన సారా సింబా, లవ్‌ ఆజ్‌కల్‌ సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం కూలీ నెం.1 సినిమాలో నటిస్తున్నారు.(‘నా భర్తతో కలిసి ఉండలేను.. సాయం చేయండి’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement