
స్టేజీపై అందరిముందు హుందాగా, అందంగా నడవాలంటే టాలెంట్, ఒంపుసొంపులు ఉంటే సరిపోదు. ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడే ఆ నడక అందం రెట్టింపు అవుతుంది. ముంబైలో జరిగిన లాక్మె ఫ్యాషన్ వీక్‌లో హీరోయిన్ సారా అలీ ఖాన్ ఎంతో దర్జాగా ర్యాంప్ వాక్ చేసింది. ఈ ఈవెంట్‌లో సిల్వర్ కలర్ లెహంగా ధరించిన సారా తన ఒంపుసొంపులతో హొయలొలికించింది. ఆమె కళ్లలోనే ఆత్మవిశ్వాసం కొట్టొచ్చేలా కనిపిస్తోంది.
కవర్ చేయలేదు
అంతేనా.. తన నడుముపై ఉన్న మచ్చను మేకప్‌తో కప్పిపుచ్చే ప్రయత్నం చేయలేదు. దాన్నలాగే వదిలేసింది. తన ర్యాంప్ వాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'కాలిన మచ్చను కవర్ చేయడానికి ప్రయత్నించలేదు చూడు, అక్కడే నచ్చేసింది.. మనం ఎలా ఉన్నా సరే మనల్ని మనం ప్రేమించుకోవాలని చాటిచెప్తోంది. నీ నిజాయితీ, గొప్పతనేమ నిన్ను మరింత బ్యూటిఫుల్‌గా మలుస్తోంది' అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వేడినీళ్లు ఒంటిపై పడటంతో అలా మచ్చలు ఏర్పడినట్లు తెలుస్తోంది.
సారా ప్రస్తుతం ఆ మూవీలో..
సారా ప్రస్తుతం 'ఏ వాటన్ మేరే వాటన్' అనే సినిమాలో నటిస్తోంది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో సారాతో పాటు సచిన్ కేడేకర్, అభయ్ వర్మ, స్పర్ష శ్రీవాత్సవ్, అలెక్స్ ఓ నీల్, ఆనంద్ తివారి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ మార్చి 21 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
చదవండి: నల్లగా ఉన్నానని హేళన.. ఇంట్లోవాళ్లు ఆరేళ్లు మాట్లాడలేదు..
Comments
Please login to add a commentAdd a comment