అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్‌ల కుమార్తె సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం పరంగా సారాకి నూటికి నూరు మార్కులు పడతాయి. ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. అలాగే ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ జాబితాలో చోటు కూడా దక్కించుకుంది. అలాంటి సారా సినీ ఇండస్ట్రీలోకి రాక మునుపు ఏకంగా 96 కిలోలు ఉండేది. ఆ తర్వాత సముతుల్య ఆహారం, వ్యాయామ దినచర్యలతో దాదాపు 40కి పైగా కిలోలు తగ్గిం 45 కిలోల బరువుకి చేరుకుంది.
అంతేగాదు తాను యుక్తవయసులో ఊబకాయం, పీసీఓడీ సమస్యలతో పోరాడనని కూడా పేర్కొంది. అయితే పీసీఓడికి ఎలాంటి నివారణ లేదు. కేవలం ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామ దినచర్య ద్వారానే సాధ్యం. అందుకోసం అని సారా సమతుల్య జీవనశైలికి కట్టుబడి ఉండటంతో బరువు తగ్గడమే గాక పీసీఓడీని నిర్వహించడంలో సహాయపడింది. ఇక్కడ సారా ఎలాంటి డైట్, వ్యాయామాలు ఫాలో అయ్యింది. అవి తనకు ఏవిధంగా సహాయపడ్డాయో చూద్దామా..!
సారా అలీ ఖాన్ బరువు తగ్గించే ప్రయాణంలో తక్కువ కార్బ్, అధిక ప్రోటీన్ ప్లాన్‌పై దృష్టి సారించి విజయవంతమయ్యింది. ఆమె రోజులో కార్బోహైడ్రేట్‌లు తీసుకోవడం ఒక భోజనానికే పరిమితం చేసింది. శరీరానికి శక్తినిచ్చేలా కొత్తిమీర, జీలకర్ర లేదా పండ్లు, కూరగాయాలతో చేసే స్మూతీ వంటి వాటిని, అలాగే ఇంట్లో తయారు చేసే పానీయాలను తీసుకునేది. రోజుని గ్రీన్ లేదా నిమ్మ తేనెతో ప్రారంభించేది. ఇక్కడ సారా శరీర బరువుని తగ్గించడంలో సహాయపడింది కేవలం ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు, టోన్డ్ బాడీని పొందేలా వర్కౌట్‌లు చేసేది.
ప్రారంభంలో తనకు ఇవన్నీ కష్టంగా అనిపించేవని తెలిపింది కూడా. ఐతే ఎంత ఇబ్బందిగా ఉన్నా..క్రమతప్పకుండా చేయడమే గాక కార్డియో వ్యాయామాలు చేసినట్లు తెలిపింది. అంతేగాదు అదనపు కిలోలు తగ్గించుకునేలా యోగా, పైలేట్స్, వంటివి కూడా చేసింది. ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామాలతో బరువుని అదుపులో ఉంచడమే గాక ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందింది. జీవనశైలిని మార్చుకుని, నిబద్దతతో వర్కౌట్లు చేస్తే ఎవ్వరైన బరవు తగ్గించొచ్చని చాటి చెప్పింది. చాలామంది స్ఫూర్తిగా నిలిచింది సారా.
(చదవండి: సౌందర్యం సాధనంగా వెదురు..బోలెడన్ని లాభాలు..!)
Comments
Please login to add a commentAdd a comment