బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్, క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్టయిందంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య వీరిద్దరూ ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తున్న ఫొటోలు బయటకు రావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. తాజాగా ఈ వార్తలకు మరింత ఆజ్యం పోస్తూ ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో సారా, శుభ్‌మన్ ఒకే హోటల్ నుంచి బయటకు వచ్చారు, అలాగే ఇద్దరూ ఒకే ఫ్లైట్ ఎక్కారు.
ఇప్పుడు చెప్పండి, వీరు లవ్‌లో ఉన్నారనడానికి ఈ సాక్ష్యం సరిపోదా? అంటున్నారు నెటిజన్లు. 'అయినా బాలీవుడ్, క్రికెట్‌ది విడదీయరాని బంధం..', 'వీళ్లు మళ్లీ కలిసి కనిపించారు, అంటే కచ్చితంగా ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందన్నమాటే', 'ఢిల్లీలో వీరు కలిసి కెఫెకు కూడా వెళ్లారు, నా స్నేహితుడు వీళ్లను చూశాడు', 'అరేయ్ బాబు.. నువ్వు ముందు నీ ఆట మీద ఫోకస్ చెయ్.. అప్పుడే నువ్వు ఇంకో విరాట్ అవగలుగుతావు' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా సారా మొదట్లో యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్‌ను ప్రేమించగా వీరిద్దరూ 2020లో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇక శుభ్‌మన్ గిల్.. సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్‌తో లవ్‌లో పడగా వీరి ప్రేమాయణం ఎంతోకాలం సాగలేదని తెలుస్తోంది.
Is that sara and shubman together again 👀😂😉#SaraAliKhan #ShubmanGill pic.twitter.com/c1XRGPUBH2
— diksha (@Dikshyaa_R) October 13, 2022
చదవండి: ఏం పీకలేనన్నారు, నేనేంటో చూపిస్తా
వెండితెర ఎంట్రీ ఇస్తున్న వంటలక్క
Comments
Please login to add a commentAdd a comment