Sara Ali Khan Shocking Comments On Vijay Deverakonda Goes Viral - Sakshi
Sakshi News home page

Sara Ali Khan: ఆ తెలుగు హీరో చాలా చాలా హాట్‌ సారా షాకింగ్‌ కామెంట్స్‌

Published Sat, Dec 11 2021 11:48 AM | Last Updated on Sat, Dec 11 2021 3:11 PM

Sara Ali Khan Hot Comments On Vijay Devarakonda And She Wants Act With Him - Sakshi

Sara Ali Khan Hot Comments On Telugu Hero: బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీ ఖాన్‌ టాలీవుడ్‌కు చెందిన ఓ  క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. కాగా సారా తాజాగా నటించిన చిత్రం అటట్రాంగి రే చిత్రం డిసెంబర్‌ 24న ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సారా ఇటీవల ఓ ఇంటరర్య్వూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెను దక్షిణాదిలో ఏ హీరో చేయాలని ఉందని అడగ్గా  వెంటనే విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు చెప్పేసింది సారా.

చదవండి: సినిమా చూసేందుకు ఆటోలో వచ్చిన స్టార్‌ హీరోయిన్‌

అంతేకాదు విజ‌య్ దేవ‌ర‌కొండ చాలా చాలా హాట్‌గా ఉంటాడ‌ంటూ తన మన‌సులో మాట బ‌య‌ట‌పెట్టింది ఈ పటౌడి వారసురాలు. కాగా లైగర్‌ మూవీ నిర్మాణంలో భాగంగా ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌ నిర్వహించిన ఓ పార్టీలో విజయ్‌-సారాలు కలుసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరూ క్లోజ్‌గా దిగిన సెల్ఫీని సారా తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక విజయ్‌ నేరుగా హిందీ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వకపోయిన పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రంతో బి-టౌన్‌ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

చదవండి: ఆ షాట్‌తో చరణ్‌, తారక్‌ల బాండింగ్‌ అర్థమైంది: రాజమౌళి

లైగర్‌ చిత్రాన్ని బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌, నటి చార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇక ఈ చిత్రం ఎక్కువ భాగం ముంబైలో చిత్రీకరణ జరుపుకోవడం బాలీవుడ్‌ నిర్మాత ఈ సినిమాలో భాగవడంతో విజయ్‌కు బి-టౌన్‌ సెలబ్రెటీలతో పరిచయం ఏర్పడింది. దీంతో అక్కడి వారికి ప్రస్తుతం విజయ్‌ బాగా సుపరిచితడయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement