
దేశమంతా బొజ్జ గణపయ్య వేడుకల్లో మునిగిపోయిన వేళ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ కూడా గణనాథుని దర్శించుకునేందుకు ఆలయానికి వెళ్లారు. పూజలు నిర్వహించి అనంతరం షూటింగ్ నిమిత్తం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను సారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘ గణపతి బప్పా మోరియా!! మీకున్న అడ్డంకులు తొలగించి, ఏడాదంతా సానుకూల దృక్పథంతో నవ్వుతూ సంతోషాలు సొంతం చేసుకునేలా ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి’ అంటూ క్యాప్షన్ జతచేశారు. ఈ క్రమంలో సారా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది నెటిజన్లు ఆమె మతాన్ని ప్రస్తావిస్తూ ట్రోల్ చేశారు. ‘నువ్వసలు ముస్లింవేనా? పవిత్ర మొహర్రం మాసంలో ఇలాంటి పనులు చేస్తావా? ఇంతకీ నీ మతం ఏమిటో గుర్తుందా లేదా’ అంటూ సారాను ట్యాగ్ చేస్తూ విపరీతమైన కామెంట్లు చేశారు.
ఈ నేపథ్యంలో ట్రోల్స్‌పై స్పందించిన ఆమె అభిమానులు...‘లౌకిక దేశమైన భారత్‌లో ప్రతీ ఒక్కరు తమకు నచ్చిన రీతిలో భగవంతుడిని కొలవచ్చు. వినాయక చవితితో పాటు ఈద్ కూడా గొప్పగా జరుపుకోవాలి సారా’ అంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు. కాగా సారా అలీఖాన్ ఒకప్పటి బాలీవుడ్ జంట సైఫ్ అలీ ఖాన్-అమృతా సింగ్‌ల కూతురన్న సంగతి తెలిసిందే. కేదార్‌నాథ్ సినిమాతో బీ-టౌన్‌లో ఎంట్రీ ఇచ్చిన సారా సింబాతో హిట్ కొట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా గతేడాది తన ఇంట్లో వినాయకుడి విగ్రహం ప్రతిష్టించి.. దేవుడికి మొక్కుతున్న చిన్నారి అబ్‌రాం ఫొటో షేర్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment