ఈ అదృష్టాన్ని నమ్మలేకున్నా: హీరోయిన్‌ | Sara Ali Khan Excited Over Atrangi Re Movie Akshay Kumar Dhanush | Sakshi
Sakshi News home page

ఈ అదృష్టాన్ని నమ్మలేకున్నా: హీరోయిన్‌

Published Thu, Jan 30 2020 3:40 PM | Last Updated on Thu, Jan 30 2020 4:22 PM

Sara Ali Khan Excited Over Atrangi Re Movie Akshay Kumar Dhanush - Sakshi

ఖిలాడి అక్షయ్‌ కుమార్‌, సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ ధనుష్‌, స్టార్‌ కిడ్‌ సారా అలీఖాన్‌లు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు ‘ఆత్రంగి రే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌, భూషణ్‌ కుమార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేమికుల రోజున విడుదల చేసేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది.(హీరోయిన్‌ను గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు!)

కాగా తన కొత్త సినిమాకు సంబంధించిన ఫొటోలను హీరోయిన్‌ సారా అలీఖాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘ఆనంద్‌ ఎల్‌ రాయ్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆత్రంగీ రే. నా అదృష్టాన్ని నమ్మలేకున్నా’  అనే క్యాప్షన్‌తో అక్కీ, ధనుష్‌లతో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం గురించి అక్షయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కేవలం పది నిమిషాల్లోనే డైరెక్టర్‌కు ఓకే చెప్పానని పేర్కొన్నాడు. సారా- ధనుష్‌ల జంట బాగుంటుందని.. వెండితెర మీద వాళ్లు మ్యాజిక్‌ చేస్తారని చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement