Sara Ali Khan Accept Her Mistakes And Reacted On Social Media Trolls - Sakshi
Sakshi News home page

Sara Ali Khan: ‘చాల తప్పులు చేశా, కొన్ని పబ్లిక్‌గానే జరిగాయి’

Published Wed, Dec 15 2021 3:23 PM | Last Updated on Wed, Dec 15 2021 4:06 PM

Sara Ali Khan Open Up On Her Mistakes And Social Media Trolls - Sakshi

Sara Ali Khan Opens Up On Her Mistake And Social Media Trolls: గతంలో తాను తప్పులు చేశానని, కానీ వాటి గుణపాఠాలు నేర్చుకున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీ ఖాన్‌. అగ్ర హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ నట వారసురాలిగా పరిశ్రమలో అడుగు పెట్టిన సారా ఆ తర్వాత తనదైన నటన, అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.  ‘కేదార్‌నాథ్‌’, ‘సింబా’, ‘లవ్‌ ఆజ్‌కల్‌2’, ‘కూలీ నం.1’ చిత్రాలతో మెప్పించిన సారా ప్రస్తుతం ‘అత్రంగి రే’ అనే సినిమాలో నటిస్తోంది.

చదవండి: నాకు ‘పుష్ప’ కథ తెలియదు: రష్మిక షాకింగ్‌ కామెంట్స్‌

ఇందులో సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌, కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌లు హీరోలు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ‘జీ5’లో స్ట్రీమింగ్ సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ  ప్రమోషన్లో భాగంగా  సారా ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నేను నా మూడ్స్‌ని చూపించడానికి సోషల్‌ మీడియా(ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌) ఉపయోగిస్తాను.

చదవండి: కత్రినాపై విక్కీ కౌశల్‌ కజిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అంతేకానీ వాటికి నా మూడ్స్‌ని నియంత్రించే అవకాశం ఇవ్వను. నచ్చితే పోస్ట్‌ పెడతాను. లేకుంటే లేదు. సామాజిక మాధ్యమాల్లో నాపై వచ్చే నెగెటివ్‌ కామెంట్స్‌, ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోను. నేను నిజాయతీగా ఉండాలనుకుంటాను. అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను. గతంలో నేను చాలా తప్పులు చేశాను. కొన్ని పబ్లిక్‌గా కూడా జరిగాయి. కానీ అవేవి నన్ను పెద్దగా బాధించలేదు. ఎందుకంటే ఆ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాను’ అంటూ సారా చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement