మళ్లీ రెచ్చిపోయారు | chain snaching cases all around hyderabad | Sakshi
Sakshi News home page

మళ్లీ రెచ్చిపోయారు

Published Sat, Oct 17 2015 6:58 AM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

మళ్లీ రెచ్చిపోయారు

మళ్లీ రెచ్చిపోయారు

హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. కొద్ది రోజుల కిందట చోటుచేసుకున్న వరుస దురాగతాల మాదిరే శుక్రవారం రాత్రి కూడా ఐదు చోట్ల గొలుసులు చోరీ చేశారు. ఎంజీబీఎస్, మాదాపూర్, పురానాపూల్, బన్సీలాల్ పేట, నారాయణ గూడాల్లో ఐదుగురు మహిళల మెడల్లోని బంగారు గొలుసుల్ని ఎత్తుకెళ్లారు.

 

కాగా, ఇన్నాళ్లూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఎక్కువగా జరిగే చైన్ స్నాచింగ్ లు ఇప్పుడు ఎంజీబీఎస్ వంటి అత్యంత రద్దీ ప్రదేశాల్లోనూ చోటుచేసుకుంటూ ఉండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పోలీసులు ఇంకాస్త సమర్థవంతంగా వ్యవహరించి సిటీలోని చైన్ స్నాచర్ల భరతం పట్టాలని జనం కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement