
ఓకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ప్రముఖ టాలీవుడ్ రచయిత కుమారుడి వివాహ రిసెప్షన్‌లో కనిపించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఈనెల 22న ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి కుమారుడి వివాహం ఘనంగా జరిగింది.
హైదరాబాద్‌లో ఈనెల 24న నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య సందడి చేశారు. చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి ఓకే ఫంక్షన్‌లో కలిశారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే చిరు ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరోవైపు బాలకృష్ణ ఎన్‌బీకే 109 చిత్రంతో బిజీగా ఉన్నారు.
Chiru 🤝Balayya @KChiruTweets | #NandamuriBalakrishna pic.twitter.com/0Kz6jLN4cr
— Whynot Cinemas (@whynotcinemass) August 24, 2024