మెడికల్ టూరిజంలోకి ఇంటెక్స్! | intex into medical tourism! | Sakshi

మెడికల్ టూరిజంలోకి ఇంటెక్స్!

Published Wed, Mar 11 2015 2:10 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

మెడికల్ టూరిజంలోకి ఇంటెక్స్! - Sakshi

మెడికల్ టూరిజంలోకి ఇంటెక్స్!

దేశంలోని 5 నగరాల్లో ప్రారంభం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఉపకరణాల సంస్థ ఇంటెక్స్ టెక్నాలజీస్ మెడికల్ టూరిజంలోకి అడుగుపెట్టింది. అందుబాటు ధరల్లో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవల్ని అందించేందుకు ‘ఇంటెక్స్ కేర్’ పేరుతో సరికొత్త సేవల్ని ప్రారంభించినట్లు ఇంటెక్స్ కేర్, ఇంటెక్స్ టెక్నాలజీస్ డెరైక్టర్ పంకజ్ గోయల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తా నగరాల్లో ఇంటెక్స్ కేర్ సేవల్ని అందించనున్నామని, ఇందుకోసం ఆయా నగరాల్లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. త్వరలోనే ఇంటెక్స్ కేర్ సేవల్ని దేశంలోని ఇతర మెట్రో నగరాలకు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ విస్తరిస్తామని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement