మల్టీ టాస్కర్స్ కోసం ఇంటెక్స్ కొత్త ఫోన్
న్యూఢిల్లీ: దేశీయ హ్యాండ్సెట్ తయారీ సంస్థ ఇంటెక్స్ టెక్నాలజీస్ తన కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఫాస్టెస్ట్ ప్రాసెసర్ తో పాటు మల్టీ టాస్కింగ్ గా ఈ కొత్త ఫోన్ వినియోగదారులు సమర్థవంతమైన సహాయం చేస్తుందని కంపెనీ చెబుతోంది. స్మార్ట్-మోషన్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన "క్లౌడ్ ట్రీడ్" డివైస్ హ్యాండ్స్ ఫ్రీ అనుభవాన్నిస్తుందని పేర్కొంది. స్నాప్ డీల్ ద్వారా మాత్రమే లభ్యం కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.4,999 గా నిర్ణయించింది. 3 జీ ఆధారిత ఈ మొబైల్ను ఆగస్టు 29 దాకా ముందస్తు బుకింగ్స్ కోసం అందుబాటులో ఉంటుందని ఇంటెక్స్ ప్రకటించింది.
ఫీచర్స్ ఇలా ఉన్నాయి...
5 అంగుళాల హెచ్ డీ స్క్రీన్
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్
1.5 గిగాహెట్జ్ హెక్సా కోర్ ప్రాసెసర్
2జీబీ రామ్
16 జీబీ మెమరీ, 32 జీబీ ఎక్స్ పాండబుల్
2200 ఎంఏహెచ్ బ్యాటరీ
5 ఎంపీ రియర్ అండ్ ఫ్రంట్ కెమెరా
దీంతోపాటుగా గెస్ట్చర్ కంట్రోల్స్, ఎమర్జెన్సీ, రక్షణ, వాయిస్ క్యాప్చర్, స్లో మోషన్ వీడియో క్యాప్చర్ లాంటి మల్టిపుల్ నేవిగేషన్ ఫీచర్స్ తో తమ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ కేశవ్ బన్సల్ చెప్పారు.