ఇండియాలో నెంబర్‌వన్ మొబైల్ బ్రాండ్ ఇంటెక్స్
హైదరాబాద్: భారత దేశపు అగ్రశ్రేణి మొబైల్ బ్రాండ్‌గా నిలిచామని ఇంటెక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐడీసీ నివేదిక ప్రకారం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో 87,55, 697 ఇంటెక్స్ మొబైల్ ఫోన్లు అమ్ముడయ్యాయని పేర్కొంది. గత ఏడాది ఇదే క్వార్టర్ అమ్మకాలతో పోల్చితే 43 శాతం వృద్ధి సాధించామని ఇంటెక్స్ టెక్నాలజీస్ బిజినెస్ హెడ్ (మొబైల్స్) సంజయ్ కుమార్ కలిరోనా పేర్కొన్నారు.
నాణ్యత గల మొబైల్ ఫోన్లను అందించడం వల్లే నంబర్‌వన్ భారత మొబైల్ బ్రాండ్‌గా నిలిచామని వివరించారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో ఆక్వా పవర్ ప్లస్, ఆక్వా 4జీ ప్లస్, ఆక్వా ట్రెండ్, ఆక్వా డ్రీమ్ టూ, క్లౌడ్ స్విఫ్ట్ వంటి వినూత్నమైన మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.