తక్కువ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌ | Intex launches affordable smartphone at Rs 4,449 | Sakshi
Sakshi News home page

తక్కువ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌

Published Mon, Feb 12 2018 3:53 PM | Last Updated on Mon, Feb 12 2018 3:53 PM

Intex launches affordable smartphone at Rs 4,449  - Sakshi

ఇంటెక్స్‌ ఆక్వా లయన్స్‌ టీ1 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌

న్యూఢిల్లీ: దేశీయ మొబైల్‌ తయారీ దిగ్గజం ఇంటెక్స్‌ ‘ఆక్వా లయన్స్‌ టీ1 లైట్‌’ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది.  దీని ధర రూ.4,449.  ఐదు అంగుళాల డిస్‌ప్లే విపణిలో తక్కువ ధరలో వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్‌ అందించడానికి ఈ మొబైల్‌ను తీసుకువచ్చినట్లు ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్‌ నిధి మార్కండేయ తెలిపారు. అలాగే ఈ మొబైల్‌ 21 భాషలను సపోర్టు చేస్తుందని వెల్లడించారు. ఇంటెక్స్‌ వాల్యూ యాడెడ్‌ సర్వీసులు ఎల్‌ఎఫ్‌టీవై(సింగిల్‌-స్వైప్‌ యాక్సెస్‌), డాటాబాక్‌, ప్రైమ్‌ వీడియాలు దీనిలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ప్రత్యేకతలు

5 అంగుళాల డిస్‌ప్లే
1 జీబీ ర్యామ్‌
8 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ( 64 జీబీ వరకు పొడిగించుకునే అవకాశం)
1.3గిగా హెర్జ్‌ ప్రాసెసర్ క్వాడ్‌కోర్‌ 64 బిట్‌ మీడియాటెక్‌ చిప్‌సెట్‌
5 మెగా పిక్సెల్‌ వెనక కెమెరా
2 మెగా పిక్సెల్‌ ముందు కెమెరా
డ్యూయల్‌ సిమ్‌
4జీ వీవోఎల్‌టీఈ
2.5డీ కర్వ్‌డ్‌ గ్లాస్‌
ఆండ్రాయిడ్‌ నౌగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement