గుట్కా ప్యాకెట్లు సరఫరా: వ్యక్తి అరెస్ట్ | man arrested in karimnagar distirict | Sakshi

గుట్కా ప్యాకెట్లు సరఫరా: వ్యక్తి అరెస్ట్

Published Wed, Aug 5 2015 9:43 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

కరీంనగర్ పట్టణంలోని కమాన్ చౌరస్తా వద్ద గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్ టౌన్: కరీంనగర్ పట్టణంలోని కమాన్ చౌరస్తా వద్ద గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద సుమారు రూ.5 వేల విలువైన గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ మార్కెట్‌లోని పలు షాపులకు గుట్కా ప్యాకెట్లను సరఫరా చేసినట్టు పట్టుబడిన వ్యక్తి తెలిపాడు. అయితే సదరు వ్యక్తి దొరకడంతో మిగతా వ్యాపారులు గోదాములకు, షాపులకు తాళాలు వేసుకుని పరారయ్యారు. నిందితుడిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement