విజయనగరం: విజయనగరంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. మే నెలలో సమ్మె బకాయిలు చెల్లింపుతో పాటు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీఎఫ్ సక్రమంగా అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. విజయనగరంలో సమ్మె కొనసాగించాలని కార్మికులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
ఇదిలాఉండగా, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపల్ కార్యాలయంలో కార్మిక సంఘాల సమ్మెపై శనివారం చర్చలు జరిపిన అనంతరం ఏపీ ప్రభుత్వం శనివారం తీసుకున్న నిర్ణయంతో అక్కడి మున్సిపల్ కార్మిక సంఘాలు సమ్మె విరమించిన సంగతి తెలిసిందే. ఈ చర్చలో భాగంగా కార్మికుల జీతం రూ. 11 వేలకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిసింది. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో మున్సిపల్ కార్మిక సంఘాల 16 రోజుల సమ్మెకు తెరపడింది. దాంతో రేపటినుంచి కార్మిక సంఘాలు విధులకు హాజరుకానున్నారు.