కార్మికులపై కాఠిన్యం | Labor austerity | Sakshi
Sakshi News home page

కార్మికులపై కాఠిన్యం

Published Tue, Jan 13 2015 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

కార్మికులపై కాఠిన్యం

కార్మికులపై కాఠిన్యం

మంత్రి వస్తారు, తమ సమస్యలు పరిష్కరిస్తారు అని ఎదురు చూసిన కార్మికులకు  నిరాశ  ఎదురైంది. మంత్రి మాట మార్చడంతో  ఆగ్రహించిన   వారు జెడ్పీ  వైస్  చైర్మన్, టీడీపీ నాయకులను నిర్బంధించారు. ఉదయం నుంచి వేచి ఉన్న పోలీసులు సాయంత్రం కార్మికులపై తమ ప్రతాపం చూపించారు.  ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్టు ఆడ,మగ అన్న తేడాలేకుండా అందర్నీ ఈడ్చుకుని వెళ్లి వ్యాన్‌లో పడేశారు. దీంతో గరివిడిలో సోమవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గరివిడి:    ఫేకర్‌లో పనిచేస్తున్న వేగన్,లారీ, కాంట్రాక్టు కార్మికులను విచ్చక్షణా రహితంగా అరెస్ట్ చేసి,  ప్రభుత్వం పండుగ కానుక ఇచ్చింది. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరడమే వారు చేసిన తప్పయింది. సమస్య పరిష్కరించడానికి సోమవారం మంత్రి మృణాళిని గరివిడి వస్తానన్నారు. కానీ   ఆమె రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన  సుమారు 300 మంది కార్మికులు.... జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి, ఇతర టీడీపీ  నాయకులును మండల పరిషత్ కార్యాలయలంలో దిగ్బంధించారు.
 
 మాటమార్చిన మంత్రి
 తమ సమస్యల పరిష్కారం కోసం ఫేకర్‌కు చెందిన వేగన్, లారీ లోడింగ్, కాంట్రాక్టు కార్మికులు ఆదివారం ఆందోళన చేసిన సమయంలో  చర్చించేందుకు సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి వస్తానని జిల్లా పరిషత్‌వైస్ చైర్మన్  బలగం కృష్ణమూర్తికి మృణాళిని తె లిపారు. ఇదే విషయాన్ని బలగం తన ఇంటిని ఆదివారం ముట్టడించిన కార్మికులకు తెలిపారు. సోమవారం ఉదయం డాగ్ స్క్వాడ్ కూడా మండల పరిషత్ కార్యాలయానికి రావడంతో అందరూ మంత్రి వస్తారని భావించారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి మాజీ ఎంపీపీ పైల బలరాం, వైస్ ఎంపీపీ బలగం వెంకట్రావు, పలు గ్రామాలకు చెందిన టీడీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సోమవారం ఉదయం 10 గంటలకే మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని వైస్‌చైర్మన్ రూంలో  కూర్చున్నారు . ఇదే సమయంలో సుమారు 300 మంది కార్మికులు కార్యాలయానికి చేరుకున్నారు.
 
 అయితే మంత్రి తమ మాటను మార్చి, కొంతమంది కార్మిక నేతలను ప్రజాప్రతినిధులను, విజయనగరం రమ్మని పోలీసుల ద్వారా సమాచారం అందించారు. దీంతో కార్మికులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను మండల పరిషత్ కార్యాలయంలో గల రూంలోనే టీడీపీ నేతలను, వైస్ చైర్మన్  నిర్బంధించారు. మంత్రి మృణాళిని వచ్చి సమస్య  పరిష్కరించేంత  వరకూ వదిలేది లేదని స్పష్టం చేశారు.   కార్యాలయం  ప్రాంగణంలో వంటావార్పు నిర్వహించి ఆందోళన కొనసాగించారు. దీంతో   చీపురుపల్లి  సీఐ రాఘవులు ఆధ్వర్యంలో సుమారు ఆరుగురు ఎస్‌ఐలు, 150 మంది వరకు కానిస్టేబుల్ మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకూ వేచి ఉన్న పోలీసులు ఒక్కసారిగా కార్మికులపై తమ ప్రతాపం చూపించారు.
 
 విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యం లో విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్టు  బలవంతంగా   ఈడ్చుకుంటూ  తీసుకెళ్లి వ్యాన్‌లో ఎక్కించారు.  ఈ గలాటలో పలువురు మహిళా కార్మికులకుగాయాలయ్యాయి. కొంతమంది సొమ్మసిల్లిపోయారు. అయినప్పటికీ విచిక్షణారహితంగా పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు.   మం త్రి వస్తారని తమగోడును వినిపించుకొని సమస్యను పరిష్కరించుకుందామని ఆశించిన కార్మికులకు   ప్రభుత్వం పోలీసులతో సమాధానం చెప్పింది. సుమారు 300 మందిని కార్మికులను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం జిల్లా పరిషత్ వైస్  చైర్మన్  బలగం కృష్ణమూర్తిని పోలీసు వ్యానులో బయటకు తీసుకువెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement