మేమెక్కడ పనిచెయ్యాలే? | Contract workers protest on the steps of the temple RAJANNA | Sakshi
Sakshi News home page

మేమెక్కడ పనిచెయ్యాలే?

Published Sat, Apr 2 2016 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM

మేమెక్కడ పనిచెయ్యాలే?

మేమెక్కడ పనిచెయ్యాలే?

రాజన్న గుడి మెట్లపై కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
కాంట్రాక్టర్‌తో  ముగిసిన ఒప్పందం
ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్
అధికారుల హామీతో ఆందోళన విరమణ

 
 
 వేములవాడ :  మేమంతా ఎక్కడ పనిచెయ్యూలంటూ రాజన్న ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు శుక్రవారం గుడి మెట్లపై ధర్నా చేశారు. ఏడాదిగా ఆలయంలో పనిచేస్తున్నామని, ఇప్పుడు కాంట్రాక్టర్ గడువు ముగియడంతో పని ఇవ్వలేనని పేర్కొన్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేసి నేరుగా దేవస్థానమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మద్దతుగా సీఐటీయూ జిల్లా నాయకులు గుర్రం అశోక్ నిలిచారు.

ఆయన మాట్లాడుతూ దేవస్థానంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 109 మంది కార్మికులకు ఉద్యోగ భద్రత, బీమా, పీఎఫ్, ఈఎస్‌ఐ వర్తింపజేయూలని కోరారు. నెల కు రూ.5,500 చెల్లిస్తున్న ఆలయ అధికారులు కార్మికులతో వెట్టిచాకిరీ చేరుుంచుకుంటున్నార న్నారు. రెండు నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల వద్దకు ఏఈవో హరికిషన్, శానిటరీ అధికారి బుద్ధి భగవాన్, నగరపంచాయతీ వైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణ చేరుకుని ఈవో రాగానే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు.
 
 ముగిసిన ఒప్పందం
ఆలయంలో వివిధ పనుల నిర్వహణ కు గతేడాది ఏప్రిల్ 1 నుంచి 2016, మార్చి 31 వరకు కార్మికుల సరఫరాకు సిరిసిల్లకు చెందిన అంబేద్కర్ మ్యూచువల్లీ ఏడెడ్ లేబర్ కాంట్రాక్టు కో-ఆపరేటివ్ సొసైటీతో ఒప్పందం చేసుకున్నారు. సదరు కాంట్రాక్టర్ రాంచందర్ 109 మంది కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిన ఆలయంలో పనులకు నియమించుకున్నారు. తన గడువు ముగుస్తుంద ని, రానున్న కాలంలో అనుభవం ఉన్న సొసైటీలకే అవకాశం ఇవ్వాలని ఫిబ్రవరి 15న ఆలయ అధికారులకు కాంట్రాక్టర్ లిఖిత పూర్వకంగా విన్నవించారు. అరుుతే తనకు ఆలయం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఏప్రిల్ 1 నుంచి కార్మికులకు తనకు సంబంధం లేదని తెలిపినట్లు తెలిసింది.  
 
 దేవస్థానమే నేరుగా చెల్లించాలి
మేమెంత పని జెప్పినా వెనుకాడుత లేదు. దేవుని దగ్గరికి వచ్చే భక్తులకు వసతులు మంచిగా ఉండేలా చూస్తున్నం. కాంట్రాక్టు విధానం రద్దు చేసి మాకు దేవస్థానం సార్లే నేరుగా జీతాలు ఇవ్వాలి.   - పెరిగె దేవమ్మ, కాంట్రాక్టు కార్మికురాలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement