సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని కాంట్రాక్టు కార్మికులకు కూడా వర్తింపచేయనున్నారు. వాస్తవానికి రెగ్యులర్ కార్మికులకే దీన్ని వర్తింపచేయాల్సి ఉన్నప్పటికీ, కాంట్రాక్టు కార్మికులను ఖాళీల భర్తీ రూపంలో తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకు ఇటీవల ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఐఆర్ వర్తింపు కూడా సాధ్యం కానుంది. ఈ విషయంపై కార్మిక సంఘాలు చేసిన అభ్యర్థనకు సర్కారు అంగీకరించింది. ఇటు రెగ్యులర్ ఉద్యోగం, అటు మధ్యంతర భృతి.. వెరసి కాంట్రాక్టు సిబ్బందికి ఒకేసారి రెండు ప్రయోజనాలు లభించినట్టయింది.
రూ.5,670 బేసిక్‌తో శ్రామిక్‌గా పనిచేస్తున్నవారికి రూ.1,530, రూ.6,570 వేతనం పొందుతున్న కాంట్రాక్టు కండక్టర్లకు రూ.1,774, రూ.7,180 వేతనం పొందుతున్న కాంట్రాక్టు డ్రైవర్లకు రూ.1,938 చొప్పున ఐఆర్ ఉంటుందని, మిగతా అన్నిరకాల కార్మికులకు కనిష్టంగా రూ.1,530, గరిష్టంగా రూ.9,300 మేర ప్రయోజనం ఉంటుందని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) ప్రధాన కార్యదర్శి పద్మాకర్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్థామరెడ్డిలు ఓ ప్రకటనలో తెలిపారు.
ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులకూ 27 % మధ్యంతర భృతి
Published Tue, Jan 28 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
Advertisement
Advertisement