RTC workers union
-
ఆర్టీసీ ఉద్యోగులకు దసరా బోనస్ లేనట్టే!
సాక్షి, హైదరాబాద్ : కరోనాతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీ తమ ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు సరిగా చెల్లించడం లేదు. అయితే దసరా పండుగను పురస్కరించుకొని ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈసారి కరోనా పరిస్థితుల వల్ల ఉద్యోగులకు బోనస్ చెల్లించే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ స్టాప్ అండ్ ఫెడరేషన్ దసరా పండుగను సంతోషంగా జరుపుకునేందుకు ఆర్టీసీ కార్మికులకు బోనస్ను చెల్లించాల్సిందిగా ఆర్టీసీ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేసింది. 'ప్రతి దసరా పండుగకు ఆర్టీసీ కార్మికులకు ఆనవాయితీగా ఇస్తున్నా పండుగ అడ్వాన్స్ ఇచ్చి ఆర్టీసీ కార్మికులను సంతోషంగా పండుగ జరుపుకునే వీలు కల్పించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హిందువులకు దసరా, క్రిష్టియన్లకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్ పండగల వేల అడ్వాన్స్ పండగ నెల జీతాలతో కలిపి అడ్వాన్స్ చెల్లించేవారు. ఈసారి పండుగ అడ్వాన్స్ ఇవ్వకపోవడం సరైంది కాదు. ఒక్కో కార్మికుడికి ఇచ్చే 4500 రూపాయలను పది నెలల కాలంలో తిరిగి యాజమాన్యం కార్మికుల జీతం నుంచి రికవరీ చేస్తుంది. ఇందుకోసం ట్రెజరీ నుంచి రూ. 25 కోట్ల ఖర్చు మాత్రమే అవుతుంది. ఈసారి జీతంతో పాటు అడ్వాన్సు ఎందుకు చెల్లించలేదో సమాచారం ఇవ్వలేదు. కనీసం సద్దుల బతుకమ్మ పండగ రోజు కైనా కార్మికులకు అడ్వాన్స్ చెల్లించేలా చూడాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నట్లుగా' పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ హామీని స్వాగతిస్తున్న ఆర్టీసీ కార్మికసంఘాలు
-
వైఎస్ జగన్ను కలిసిన టెక్కిలి ఆర్టీసీ కార్మిక సంఘాలు
-
ఆర్టీసీ ఎండీకే ఎస్పీవీల చైర్మన్ పగ్గాలు
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) నిధులతో కొనుగోలు చేసే బస్సుల నిర్వహణకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటులో ఆర్టీసీ అధికారుల ఆజమాయిషీనే ఉండాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు పట్టుపట్టాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో మున్సిపల్ కమిషనర్, జిల్లాల్లో కలెక్టర్ల అధ్యక్షతన ఎస్పీవీలు ఉండాలనే నిబంధనను వ్యతిరేకించాయి. ఆర్టీసీ ఎండీనే ఎస్పీవీలకు చైర్మన్గా ఉండాలని, ఆర్టీసీ ఈడీ ఎండీగా కలిపి ఏడుగురు సభ్యులకుగాను ఐదుగురు ఆర్టీసీ అధికారులే ఉండేలా చూడాలని, ఇద్దరు మాత్రమే ప్రభుత్వ అధికారులుండాలని డిమాండ్ చేశాయి. ఇందుకు బెంగళూరులో విజయవంతంగా అమలవుతున్న ఎస్పీవీల విధానాన్ని అనుసరించొచ్చేమో పరిశీలించేందుకు అక్కడికి వెళ్లిరావాలని సూచించాయి. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ఈ మేరకు బోర్డుకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్పీవీల ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర పడింది. జేఎన్ఎన్యూఆర్ఎం నిధులను పట్టణ ప్రాంతాలకే వినియోగించాల్సి ఉన్నందున ఆ నిధులతో కొనే బస్సులను పట్టణాల్లోనే తిప్పాల్సి ఉంది. దీంతో 4 ఎస్పీవీలు ఏర్పాటు చేసి వాటి పరిధిలోకి వీలైనన్ని ప్రాంతాలను తీసుకురావాలని నిర్ణయించారు. మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలను కలిపి హైదరాబాద్ ఎస్పీవీ, విజయవాడ, విశాఖ, విజయనగరం, గుంటూరు, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలతో విజయవాడ ఎస్పీవీ, వరంగల్ ఆర్టీసీ జోన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలతో వరంగల్ ఎస్పీవీ, రాయలసీమ జిల్లాలతో కడప ఎస్పీవీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులకూ 27 % మధ్యంతర భృతి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని కాంట్రాక్టు కార్మికులకు కూడా వర్తింపచేయనున్నారు. వాస్తవానికి రెగ్యులర్ కార్మికులకే దీన్ని వర్తింపచేయాల్సి ఉన్నప్పటికీ, కాంట్రాక్టు కార్మికులను ఖాళీల భర్తీ రూపంలో తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకు ఇటీవల ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఐఆర్ వర్తింపు కూడా సాధ్యం కానుంది. ఈ విషయంపై కార్మిక సంఘాలు చేసిన అభ్యర్థనకు సర్కారు అంగీకరించింది. ఇటు రెగ్యులర్ ఉద్యోగం, అటు మధ్యంతర భృతి.. వెరసి కాంట్రాక్టు సిబ్బందికి ఒకేసారి రెండు ప్రయోజనాలు లభించినట్టయింది. రూ.5,670 బేసిక్తో శ్రామిక్గా పనిచేస్తున్నవారికి రూ.1,530, రూ.6,570 వేతనం పొందుతున్న కాంట్రాక్టు కండక్టర్లకు రూ.1,774, రూ.7,180 వేతనం పొందుతున్న కాంట్రాక్టు డ్రైవర్లకు రూ.1,938 చొప్పున ఐఆర్ ఉంటుందని, మిగతా అన్నిరకాల కార్మికులకు కనిష్టంగా రూ.1,530, గరిష్టంగా రూ.9,300 మేర ప్రయోజనం ఉంటుందని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) ప్రధాన కార్యదర్శి పద్మాకర్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్థామరెడ్డిలు ఓ ప్రకటనలో తెలిపారు. -
24న సమ్మె నోటీసు: ఎన్ఎంయూ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసు క్రమబద్ధీకరణపై ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు వెలువరించని పక్షంలో సమ్మె చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్ఎంయూ నిర్ణయించింది. ఈ మేరకు 24న యాజమాన్యానికి నోటీసు అందజేయాలని యూనియన్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వర్రావు, మహమూద్ మంగళవారంప్రకటించారు. ఆర్టీసీలో దాదాపు 24 వేల మంది కార్మికుల సర్వీసును క్రమబద్ధీకరించాలని చాలా కాలంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల సీమాంధ్ర ఉద్యమ సమయంలో సమ్మె విరమణకోసం జరిపిన చర్చల్లో రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ క్రమబద్ధీకరణపై సానుకూలంగా స్పందించారు. కానీ, ఇప్పటివరకు క్రమబద్ధీకరణపై అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 21లోపు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు వెలువడని పక్షంలో 24న సమ్మె నోటీసు ఇస్తామని ఎన్ఎంయూ ప్రకటించింది. -
ఆర్టీసీ సిబ్బందికి 8% డీఏ పెంపు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సిబ్బందికి శుభవార్త. కరువు భత్యాన్ని 8% పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై నుంచి ఇది అమలులోకి రానున్న నేపథ్యంలో గడచిన 4 నెలలకు సంబంధించి బకాయిల రూపంలో ఒకేసారి చెల్లించనున్నారు. ప్రస్తుతం 47.8%గా ఉన్న కరువు భత్యం ఈ పెంపు తో 55.8%కు చేరుకోనుంది. రెగ్యులర్ సిబ్బందికి ఈ లబ్ధి అందనుంది. దీపావళి కానుకగా ఆర్టీసీ యాజ మాన్యం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇటీవల సీమాంధ్ర ఉద్యమానికి మద్దతుగా కార్మికులు జరిపిన సమ్మెను విరమించే సమయంలో మంత్రి బొత్స సమక్షంలో జరిగిన చర్చలో డీఏ పెంపుపై ఒప్పందం కుదిరిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, ఎన్ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మహమూద్లు పేర్కొన్నారు.