గోదావరిఖని/మంచిర్యాల సిటీ : సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జేబీసీసీఐ హైపవర్ కమిటీవేతనాలను అమ లు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29, 30 తేదీలలో సమ్మె చేయాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. సోమవారం గోదావరిఖనిలోని సీఐటీయూ శ్రామికభవన్‌లో బుర్ర తిరుపతి అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీఐటీయూ ప్రధాన కార్యదర్శి బి.మధు, ఏఐటీయూసీ కార్యదర్శి రాజరత్నం, ఇప్టూ అధ్యక్షుడు ఎ.వెంకన్న, హెచ్‌ఎంఎస్ కార్యదర్శి ఆర్.కేశవరెడ్డి, టీసీసీఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్, లోడింగ్, అన్‌లోడింగ్ కార్మికుల సంఘం అధ్యక్షుడు శంకర్‌ముదిరా జ్, టీఎంసీడబ్ల్యుయూ ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీనివాస్, తెలంగాణ 42, 43 ప్రజాసమితి నాయకులు మంద రవికుమార్ హాజరయ్యా రు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, ఓబీ, కోల్ ట్రాన్స్‌పోర్టు, సివిల్, అన్ని విభాగాల కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
యథావిధిగా ఇఫ్టూ సమ్మె
గతంలో నిర్ణయించిన విధంగా ఇఫ్టూ అనుబం ధ సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూ నియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఈనెల 18, 19 తేదీలలో తలపెట్టి న టోకెన్ సమ్మె యథావిధిగా కొనసాగుతుంద ని ఆ యూనియన్ అధ్యక్షుడు కె.విశ్వనాథ్ ప్రకటించారు. జేఏసీ సమావేశానికి హాజరైన ఆయన సమ్మె కోసం కాంట్రాక్టు కార్మికులు సిద్ధమైన నేపథ్యంలో ఈ రెండు రోజులు సమ్మె నిర్వహిస్తామని, ఆ తర్వాత 29, 30 తేదీలలో జేఏసీ నిర్వహించతలపెట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు. నాలు గు నెలల కాలం నుంచి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై సమ్మె చేయడానికి నిర్ణయించి కార్మికులను సన్నద్ధం చేశామని, వారి కోరిక మేరకు సమ్మె చేసి తీరుతామని ప్రకటించారు.
29, 30 తేదీలలో జేఏసీ సమ్మె
Published Tue, Dec 16 2014 2:38 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement