Data base
-
వామ్మో.. నీళ్లన్నీ తాగేస్తున్న చాట్‌జీపీటీ, ఇలా అయితే కష్టమే!
విడుదలైన కేవలం రెండు నెలల్లోనే వంద కోట్లమంది యూజర్లతో ప్రపంచాన్ని చుట్టేసింది చాట్‌జీపీటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీతో ఎన్నె అద్భుతాలు చేస్తున్న అందరి నోట ఔరా అనిపించింది. దిగ్గజ సంస్థలకు సైతం పోటీగా నిలబడే స్థాయికి చేరుకుంటోంది. అయితే ఇదంతా ఇప్పటి వరకు మనకు పైకి తెలిసిన విషయం మాత్రమే. కాయిన్‌కు రెండు వైపుల ఉన్నట్లు చాట్‌జీపీటీ కూడా రెండో వైపు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ చాట్పిట్ని పరీక్షిస్తున్నారా…? చాట్జీపీతో ఒక అంశం ఆధారంగా కథనం, కథ లేదా కవిత రాయాలనే ఆసక్తి ఉన్నవారు ఇంకో విషయం తెలుసుకోవాలి...! ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజూ ఇలా ChatGPTని ఉపయోగిస్తున్నందున, మనం దీనికి భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్సైడ్, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఆర్లింగ్టన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో.. 20-50 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు చాట్‌జీపీటీకి దాదాపుగా అర లీటరు నీరు అవసరం అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అసలు చాట్‌జీపీటీకి, నీటి మధ్య సంబంధం ఏమిటంటే.. ChatGPT వంటి ఏఐ మోడల్లను అమలు చేస్తున్నప్పుడు ఆ సర్వర్లను చల్లబరచడానికి పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగిస్తాయట. డాటా సెంటర్ల నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు ఉత్పత్తికి నీటి వినియోగాన్ని లెక్కగట్టి శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. పైగా ఇందుకు మంచి నీటినే వినియోగించాల్సి ఉంటుందట. జీపీటీ-3కి శిక్షణ ఇవ్వడానికే మైక్రోసాఫ్ట్ 7 లక్షల లీటర్ల నీటిని వినియోగించడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. చాట్ జీపీటీకి కోట్ల మంది యూజర్లు ఉన్నందున డాటా సెంటర్లకు భారీగా నీటి వినియోగం ఉంటున్నదని ఈ అధ్యయనంలో బయటపడింది. ఇదే కాకుండా ఇతర సంస్థల ఏఐ మాడళ్లు కూడా భారీగా నీటిని వినియోగిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. చదవండి: ఆ దేశాలకు ఆయుధాలు అమ్మబోం.. అలాంటి ఉద్దేశమే లేదు: చైనా -
మా డేటా మాదే..!
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర సమాచారం తమకు ప్రత్యేకంగా ఇవ్వాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్న విద్యాలయాలకు సంబంధించిన సమగ్ర సమాచార నిధి(డేటా బేస్) యు–డైస్(డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్)తో తమకు సంబంధం లేదని పేర్కొంది. యూడైస్ ప్లస్ పేరుతో కేంద్రం సరికొత్త పోర్టల్‌ను సృష్టించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, ఖాళీల వివరాలు ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది. స్కూళ్లలో మౌలిక వసతులు, ఆధార్ అనుసంధానం, మధ్యాహ్న భోజన వివరాలను యూడైస్ ప్లస్‌లో అందించాలి. అందులో అడిగిన మేరకు సమాచారం అందించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాఠశాలల్లో నడిచే కార్యక్రమాలకు ఇదే కీలకమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో యూడైస్ ప్లస్ ద్వారా సమాచారం ఇవ్వకపోతే నిధుల విడుదల కష్టమని హెచ్చరించినట్టు తెలిసింది. నేడు, రేపు సదస్సు యూడైస్ ప్లస్‌పై సమగ్ర అవగాహన కల్పించేందుకు శుక్ర, శనివారాల్లో విజయవాడలో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన రాష్ట్రస్థాయి సమన్వయకర్తలు ఈ సదస్సులో పాల్గొనాలని సూచించింది. వీరి ద్వారా జిల్లాస్థాయిలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాస్థాయిలో సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఏఎస్వోలకు కొత్త విధానంపై సంపూర్ణ అవగాహన కలిగించి ఏమైనా సందేహాలుంటే శిక్షణ పొందినవారు నివృత్తిచేస్తారు. ’డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ, న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో సదస్సు జరుగుతోంది. ‘యు–డైస్ ప్లస్’ కార్యాచరణపై కేంద్రం అన్ని జిల్లాల్లోని డీఈవో కార్యాలయాలకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. -
‘ట్యాంపరింగ్’ కేసు వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) డేటాబేస్‌లో వెలుగుచూసిన రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారంపై తమకు పూర్తి వివరాలు, రికార్డులు అందించాలని ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్ క్రైం పోలీసులు ఆదేశించారు. డాక్టర్ల రిజిస్ట్రేషన్ విధివిధానాలు, డేటాబేస్ నిర్వహణ, సాంకేతిక అంశాలను తమకు సమర్పించాలని టీఎస్ఎంసీకి శుక్రవారం నోటీసులు జారీ చేశారు. వివరాలన్నీ అందితేనే సాంకేతికంగా దర్యాప్తు చేయడానికి, కేసులో ముందుకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 2016లో కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని నంబర్ పొందిన ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్ల రికార్డులను కొందరు ‘ఇంటిదొంగలు’ ట్యాంపర్ చేసి వేరే వ్యక్తుల పేర్లతో డేటాబేస్‌లో నమోదు చేసినట్లు వెలుగులోకి రావడం తెలిసిందే. డాక్టర్ నాగమణి అర్హతల విషయంలో తొలుత గందరగోళం ఏర్పడటంతో ఆమె వివరాలు ట్యాంపర్ అయినట్లు తొలుత భావించిన కౌన్సిల్... పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ అంశాన్నీ చేర్చింది. అయితే నాగమణి దరఖాస్తులో పొరపాటు రావడం వల్లే అలా జరిగిందని, ఆమె అంశంలో ఎలాంటి ట్యాంపరింగ్ లేదని శుక్రవారం స్పష్టమైంది. -
కేంద్రం కీలక ఆదేశాలు! కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూజర్ల వివరాలన్నీ..
టెలికాం ఆపరేటర్లకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్ల కాల్ రికార్డింగ్ డాటాను, ఇంటర్నెట్ యూసేజ్ డాటాను రెండేళ్ల పాటు భద్రపర్చాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. గతంలో ఈ సమయం ఏడాది పాటే ఉండేది. ఒకవేళ భద్రతా ఏజెన్సీలు కోరితే ఆ గడువును పెంచే విధంగా సవరణ వెసులుబాటు ఉండేది(గతంలో ఎన్నడూ జరగలేదు!). అయితే ఈసారి రెండేళ్లపాటు భద్రపర్చాలంటూ యునిఫైడ్ లైసెన్స్ అగ్రిమెంట్‌కు సవరణ చేయడం విశేషం. రెండేళ్లపాటు లేదంటే ప్రభుత్వం చెప్పేవరకు వివరాలను భద్రపర్చి ఉంచాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం(DoT) డిసెంబర్ 21న ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా టెలికామ్ కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, టెలికాం లైసెన్స్‌లు కలిగిన ఇతరులు.. కమర్షియల్‌తో పాటు యూజర్ల కాల్ వివరాల రికార్డ్లను భద్రపర్చాలని స్పష్టం చేసింది. భద్రతా ఏజెన్సీలు కోరినందునే ఈసారి ఈ సవరణ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రజాప్రయోజనాల దృష్ట్యా లేదంటే భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని టెల్కోస్, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు టెలికమ్యూనికేషన్ విభాగం ఈ తరహా ఆదేశాల్ని జారీ చేస్తుంటుంది. కాల్ రికార్డింగులు, మెసేజ్‌ల వివరాలతో పాటు ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ఈ-మెయిల్, లాగిన్, లాగ్ అవుట్.. ఇలా అన్ని వివరాలను జాగ్రత్త పర్చాల్సి ఉంటుంది. ఐపీ అడ్రస్ వివరాలకు అదనంగా ఈసారి ఇంటర్నెట్ టెలిఫోనీ(యాప్‌ల ద్వారా చేసే కాల్స్, వైఫై కాల్స్ తదిరత వివరాలు) సైతం రెండు సంవత్సరాలపాటు భద్రపర్చాల్సిందే!. దర్యాప్తు, విచారణ, భద్రతా ఏజెన్సీలు ఎప్పుడు కోరితే అప్పుడు ఆ వివరాల్ని కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్.. మీరూ కుబేరులు అయిపోవచ్చు! -
వాట్సాప్‌కు భారీ దెబ్బ..!
మాస్కో: ప్రముఖ సోషల్ మీడియా మెసేంజర్ వాట్సాప్‌కు రష్యాలో భారీ దెబ్బ తగిలింది. రష్యా ప్రభుత్వం సుమారు మూడు మిలియన్ల రూబెల్స్‌ను వాట్సాప్‌పై జరిమానా విధించనుంది. రష్యా దేశ నియమాలను ఉల్లఘించినందుకు వాట్సాప్‌పై జరిమానా విధించినట్లు తెలుస్తోంది. రష్యా భూభాగంలో రష్యన్ వినియోగదారుల డేటాను స్థానికీకరించడంలో వాట్సాప్ విఫలమైంది. వాట్సాప్‌పై తగు చర్యలు తీసుకోవడానికి రష్యా ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే రష్యా ప్రభుత్వం వాట్సాప్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్‌లను ప్రారంభించే అవకాశం ఉందని స్థానిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కాగా ఈ విషయంపై ఫేస్బుక్ స్పందించలేదు. కొద్దిరోజుల క్రితమే గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్‌పై కూడా రష్యా ప్రభుత్వం 3 మిలియన్ల రూబిళ్లను జరిమానా విధించింది. వ్యక్తిగత డేటా చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను రష్యన్ కోర్టు ఫేస్బుక్, ట్విటర్‌పై కూడా జరిమానాను విధించింది. రష్యా అడ్మినిస్ట్రేటివ్ దిగ్గజ కంపెనీలపై జరిమానాలను విధించడం గత కొన్ని రోజుల నుంచి నడుస్తూనే ఉంది. వాట్సాప్‌కు ఒక మిలియన్ లేదా 6 మిలియన్ రూబిళ్ల నుంచి జరిమానా విధించవచ్చునని ఇంటర్ ఫాక్స్ తన నివేదిక పేర్కొంది. -
AP: సర్వర్ సమస్యలు క్లియర్
గుణదల (విజయవాడ తూర్పు): సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తరచూ ఏర్పడుతున్న సర్వర్ కష్టాలకు చెక్ పెట్టేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపట్టింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా సేవలందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ సంబంధిత సర్వర్‌ను నిలిపేసి డేటా బేస్‌ను మార్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. సోమవారం నుంచి వేగవంతంగా సేవలందించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉమ్మడిగా సర్వర్ సేవలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని సర్వర్ విధానం హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సర్వర్లు ఇప్పటివరకు ఒకే కేంద్రంగా పని చేస్తున్నాయి. ఈ కారణంగా వందలాది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించిన సేవలు అందించడంలో సామర్థ్యం సరిపోవడం లేదు. సాంకేతిక సమస్యలు ఏర్పడి కక్షిదారులు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమన్వయంతో సర్వర్ డేటాబేస్ విభజన చేస్తున్నారు. తొలగనున్న రిజిస్ట్రేషన్ కష్టాలు సర్వర్ సక్రమంగా పనిచేయని కారణంగా ఇప్పటి వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తరచూ కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో ఏకంగా 20 రోజుల పాటు ఈసీలు, సీసీలు రాక ప్రజలు అవస్థలు పడ్డారు. సకాలంలో రిజిస్ట్రేషన్లు జరగక అమ్మకందార్లు, కొనుగోలు దార్లు సంకట స్థితిలో పడ్డారు. ఈ ప్రభావం బ్యాంక్‌లపై పడటంతో లోన్లు రాక రుణ గ్రహీతలు తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం సర్వర్ సామర్థ్యం పెంచటం వల్ల ఈ కష్టాలన్నీ తీరుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సర్వర్ సామర్థ్యం పెంచేందుకు కృషి హైదరాబాద్ నుంచి మంగళగిరికి డేటాబేస్ సిస్టమ్‌ను మార్చే ప్రక్రియ జరుగుతోంది. ఆదివారం సాయంత్రానికి సర్వర్ అప్డేట్ చేస్తాం. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. సర్వర్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు భవిష్యత్‌లో నెట్వర్క్ విధానాన్ని అభివృద్ధి చేస్తాం. – నలమల రేవంత్, కార్డ్ సూపరింటెండెంట్ (విజయవాడ) మంగళగిరిలో ‘పై’ డేటా సెంటర్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘పై’డేటా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సిస్ఫై సంస్థ నిర్వహణలో పై డేటా సెంటర్ ఉంటుంది. ఐటీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఉండే ఈ సంస్థ ద్వారా ఏపీకి సంబంధించిన డేటాబేస్‌ను మార్చారు. రాష్ట్రంలో ఉండే 294 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇకపై మంగళగిరి నుంచే సర్వర్ ఆపరేషన్స్ జరుగుతాయి. హైదరాబాద్ నుంచి మంగళగిరికి డేటాబేస్‌ను మార్చే ప్రక్రియలో సర్వర్ సామర్థ్యం పెరిగి సమస్యలు తొలగుతాయని అధికారులు తెలియజేస్తున్నారు. -
యాప్‌లో వివరాలు 30రోజుల్లో డిలీట్
న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్‌లో సాధారణ వినియోగదారుడి వివరాలైతే 30 రోజుల్లో, కరోనా సోకిన వ్యక్తి వివరాలైతే 45–60 రోజుల్లో ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయని కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు. ఆరోగ్య సేతు యాప్ అనేది కరోనాను ఎదుర్కొనేందుకు రూపొందించిన సోఫిస్టికేటెడ్ సర్వీలెన్స్ కలిగిన యాప్ అని తెలిపారు. ఈ యాప్‌ను ఇప్పటికే 9.5 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని, దీనిపై ప్రజలకు ఎంత నమ్మకముందో దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. కరోనా సోకిన వారు దగ్గరలో ఉంటే హెచ్చరిచేందుకు ఈ యాప్‌ను వాడేవారిలొకేషన్ వివరాలను తీసుకుంటుందని తెలిపారు. ఇతర దేశాల్లో ఇలాంటి యాప్‌లు వాడుతున్నారని, దీనిపై అక్కడ మనదేశంలో వచ్చినట్లు ఆరోపణలు రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయవద్దంటూ రాహుల్ గాంధీని కోరారు. ప్రజల కోసమే ఐసీఎంఆర్ వద్ద ఉన్న డేటాబేస్‌తో దాన్ని నడుపుతున్నట్లు తెలిపారు. -
‘ఆటో’ ఇటో కాకుండా!
ఇకపై ఆటో ప్రయాణం భద్రంగా సాగుతుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రయాణికులు ఆటో ఎక్కేయొచ్చు. ఎందుకంటే నగరంలోని ప్రతి ఆటో వివరాన్నీ సేకరించి పోలీసులు భద్రపరుస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక డేటా బేస్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఆటోకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ కేటాయిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: నగర వ్యాప్తంగా దాదాపు 1.4 లక్షల ఆటోలు సంచరిస్తున్నట్లు అంచనా. అయితే వాటికి సంబంధించి అధికారిక రికార్డుల్లో ఉన్న చిరునామాలు, ప్రస్తుతం వాటి యజమానులు/డ్రైవర్లు అడ్రస్‌లకు సంబంధం లేని కారణంగానే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ–చలాన్లు పేరుకుపోవడంతో పాటు కొన్ని నేరాల్లో నిందితులు చిక్కట్లేదు. దీనిని దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో సంచరిస్తున్న ఆటోలతో పాటు వాటిని నడుపుతున్న డ్రైవర్ల పూర్తి వివరాలతో డేటాబేస్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డేటాబేస్ ఆధారంగా ప్రతి వాహనానికీ ప్రత్యేకంగా క్యూఆరో కోడ్‌తో కూడిన పోలీస్ నంబర్ కేటాయిస్తారు. వీటితో పాటు ఆటో లోపలి భాగంలో నేమ్షీట్ల ఏర్పాటు కోసమూ సన్నాహాలు చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్, కోడ్స్ జారీ విధానానికి ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ అని నామకరణం చేశారు. సగానికి సగం వేరే చిరునామాలే... రాజధానిలోని ఆటోలకు సంబంధించి ఆర్టీఏ రికార్డుల్లో కనీసం 50 శాతం కూడా అసలైన చిరునామాలపై లేవు. ఫలితంగా ఏదైనా ఉదంతం జరిగినప్పుడు దర్యాప్తులో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. ఇక ఆటోవాలాల ఉల్లంఘనల విషయానికి వస్తే నగరంలోని వాహనాల్లో వీటి వాటా నాలుగు శాతం లోపే కాగా... పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్ల సంఖ్య మాత్రం 20 శాతం దాటుతోంది. నగరంలో ఎన్ని ఆటోలు ఉన్నాయి..? ఎన్ని సంచరిస్తున్నాయి? అంటూ ఆర్టీఏ అధికారులను అడిగితే ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. నగరంలో డబుల్ రిజిస్ట్రేషన్ నెంబర్, బోగస్ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలు 40 శాతం వరకు ఉంటాయని పోలీసుల అంచనా. ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న ఆటోడ్రైవర్లు, యజమానులు అందిస్తున్న పత్రాల విశ్వసనీయత, చిరునామా పక్కానా? కాదా? అనేవి క్రాస్ చెక్ చేసేందుకు ఆర్టీఏ వద్ద వనరులు లేవు. నగర వ్యాప్తంగా విస్తృత దాడులు చేసి ఇలాంటి వాటికి చెక్ చెప్పాలన్నా... ఉన్న సిబ్బందితో రోటీన్ పనులే కష్టంగా మారాయి. ప్రత్యేక నంబరింగ్‌కు సన్నాహాలు... ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఆటో డ్రైవర్లు, యజమానుల తాజా వివరాలతో ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో వాహనం ఎవరి పేరుతో ఉన్నప్పటికీ ప్రస్తుత యజమాని ఎవరు? ఎవరు డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నారు? వారి చిరునామా, సెల్ నెంబర్ తదితరాలను పొందుపరచనున్నారు. ఈ ప్రక్రియకు తొలుత ఆటోడ్రైవర్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి గోషామహల్, బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ప్రత్యేక కేంద్రాలు పని చేయనున్నాయి. ఈ వివరాలను సర్వర్‌లో నిక్షిప్తం చేసి పీడీఏ మిషన్లను అనుసంధానించి క్షేత్రస్థాయిలో ఉండే ట్రాఫిక్ అధికారులు తనిఖీ చేయించాలని భావిస్తున్నారు. అసలు వివరాలు ఇవ్వని, తప్పుడు వివరాలు అందించిన వారిని గుర్తించి అప్పటికప్పుడు అప్డేట్ చేసేలా చర్యలు తీసుకోవడానికి సన్నాçహాలు చేస్తున్నారు. ♦ ఆటోల్లో అనేకం ఒకరి పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉంటే... వాటిని అద్దెకు తీసుకుని, పర్మిట్ ఆధారంగా నడిపే వారు వేరే వ్యక్తులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రైవర్లు ఆర్సీ వివరాలు, పర్మిట్ వివరాలతో వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించాలి. ♦ ఈ దరఖాస్తుతో పాటు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవర్‌తో పాటు ఓనర్ల గుర్తింపుకార్డులు సమర్పించాలి. ♦ ఈ నెల 17 నుంచి గోషామహల్, బేగంపేట టీటీఐల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలు పనిచేస్తాయి. -
ప్రధాని సహా 15 లక్షల మంది ఇన్ఫర్మేషన్ చోరీ
సింగపూర్: హ్యాకర్ల దాడితో సింగపూర్ వణికిపోయింది. ప్రభుత్వ ఆరోగ్య శాఖకు చెందిన డాటాబేస్ నుంచి ఏకంగా 15 లక్షల మంది సింగపూర్ వాసుల ఆరోగ్య వివరాలను సైబర్ నేరగాళ్లు తస్కరించారు. ప్రధాని లీ హీన్ లూంగ్ ఆరోగ్య రహస్యాలను కాజేయడానికే ఈ హ్యాకింగ్ జరిగినట్లు భావిస్తున్నామని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇది ఆకతాయి చర్య కాదనీ, చాలా తెలివిగా, పథకం ప్రకారం జరిగిన దాడి అని అధికారులు పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఆరోగ్యానికి సంబంధించిన కీలక వివరాలను దొంగిలించడానికి ఆరోగ్య శాఖ డాటాబేస్‌పై సైబర్ దాడి జరిగిందని హెల్త్ మినిస్టర్ గన్ కిమ్ యోంగ్ మీడియాకు తెలిపారు. కాగా, ఎంతో అభివృద్ధి చెందిన సింగపూర్‌లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. అలాంటిది ప్రభుత్వ డాటాబేస్‌పైనే సైబర్‌దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిటీ నడిబొడ్డున్న రక్షణ శాఖకు చెందిన అధునాతన ఆయుధాలు ఉన్నందున సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి నిఘా వర్గాలు గతంలో పలుమార్లు హెచ్చరించాయి. ఇదిలా ఉండగా.. 2017లో రక్షణ శాఖ డాటాబేస్‌లోకి చొరబడిన దుండగులు 850 మంది ఆర్మీ అధికారుల వివరాలను హ్యాక్ చేశారు. -
ఏ‘మార్చలేరు’.!
వివిధ నేరాలకు పాల్పడే నేరగాళ్ల సమాచారాన్ని పక్కాగా సేకరించాలని సిటీ పోలీస్ విభాగం నిర్ణయించింది. ఏదైనా కేసులో అరెస్టయిన నేరగాడి ఆధార్ నెంబర్ తప్పకుండా సేకరించి ప్రత్యేక డేటా బేస్‌లో పొందుపరుస్తారు. తద్వారా ఆ నేరగాడు ఒకటి కంటే ఎక్కువ నేరాలకు పాల్పడినా...పేర్లు మార్చినా..తప్పుడు విధానాలకు పాల్పడినా అతన్ని వెంటనే గుర్తించడం తేలికవుతుంది. సాక్షి, హైదరాబాద్: తార్నాక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని గతేడాది పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వరుసగా నేరాలు చేయడానికి అలవాటు పడిన ఆ నిందితుడు ఈ ఏడాది మరోసారి బహదూర్‌పురా పోలీసులకు చిక్కాడు. అయితే రెండోసారి తన పేరును మార్చి చెప్పడంతో అతగాడి పాత చరిత్ర వెలుగులోకి రాలేదు. దీంతో అతడిపై ‘కఠిన చర్యలు’ తీసుకోవడానికి పోలీసులకు అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలో అతగాడు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నా... నేర చరిత్ర ఉన్నా జారీ అయిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటివి ఉత్పన్నం కాకుండా ఉండటానికి, నేరగాళ్లను కట్టడి చేయడానికి, వారి గత చరిత్రను ఎప్పకప్పుడు తెలుసుకోవడంతో పాటు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ పక్కాగా జరగడానికి నగర పోలీసు విభాగం నిందితుల ఆధార్ నెంబర్ నమోదు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏదైనా తీవ్రమైన నేరంలో అరెస్టు అయిన వ్యక్తుల ఆధార్ నెంబర్లు సైతం పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌తో సహా రికార్డుల్లో పొందుపరుస్తున్నారు. ‘పేర్లు’ మారుస్తూ తప్పుదారి... ఏటా 18వేలకు పైగా కేసులు నమోదయ్యే సిటీ కమిషనరేట్‌లో నిందితులందరినీ పోలీసు అధికారులు గుర్తుంచుకోవడం కష్టం. దీనితోడు నగరంలో ఉన్న ఐదు జోన్లలో ఓ జోన్ పరిధిలో అరెస్టు అయిన వ్యక్తి పూర్తి సమాచారం, మరో జోన్ అధికారుల వద్ద అందుబాటులో ఉండదు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న టెక్నికల్ ప్లాట్‌ఫామ్‌తో ఇది కొంత వరకు అమలవుతున్నా, పాస్పోర్ట్స్ వెరిఫికేషన్ వద్దకు వచ్చే సరికి పూర్తి స్థాయిలో ఫలితాలు ఉండట్లేదు. దీనికితోడు నేరగాళ్లు వేస్తున్న ఎత్తులు అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతన్నాయి. నగర పోలీసులు గడిచిన రెండున్నరేళ్లుగా ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్‌ను విస్త్రృతంగా వినియోగిస్తున్నారు. పదేపదే నేరాలు చేసే వారిని గుర్తిస్తూ, ఏకకాలంలో మూడు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై దీన్ని ప్రయోగిస్తున్నారు. ఈ భయానికి తోడు వరుసగా నేరాలు చేసే నేరగాళ్లలో కొందరు తమ చరిత్ర వెలుగులోకి రాకుండా ఉండేందుకూ కొత్త ఎత్తులు వేయడం ప్రారంభించారు. ఓసారి అరెస్టు అయినప్పుడు ఇంటి పేరు ముందు, అసలు పేరు వెనుక చెప్తూ, మరోసారి అరెస్టు అయిన సందర్భంలో పేరు ముందు, ఇంటి పేరు వెనుక చెప్పడంతో పాటు పేర్లలో కొన్ని మార్పులు చేస్తున్నారు. స్పెల్లింగ్‌లో మార్పుచేర్పులతో... ఇలాంటి ‘మార్పిడిగాళ్లు’ పూర్తిగా తమ పేర్లను మార్చరు. అరెస్టు అయిన ప్రతిసారీ బెయిల్ పొందడం కోసం న్యాయస్థానంలో ధ్రువీకరణలు ఇవ్వాల్సి ఉంటుంది. తప్పుడు పేరు చెప్తే అక్కడ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా స్పెల్లింగ్స్ మార్చేస్తూ కథ నడుపుతున్నారు. ఉదాహరణకు పేరు చివరలో ‘అయ్య’ అని వచ్చే పేరునే తీసుకుంటే ఓసారి అరెస్టు అయినప్పుడు చివరి స్పెల్లింగ్ ‘వైవైఏ’ అంటూ, మరోసారి చిక్కినప్పుడు దీన్ని ‘ఐఏహెచ్’గా రాస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా కేటుగాళ్ల సంఖ్య పెరిగినట్లు పోలీసు విభాగం గుర్తించింది. ఇలాంటి నేరగాళ్లకు చెక్ చెప్పడానికి వివిధ కేసుల్లో అరెస్టు అయిన నిందితుల ఆధార్ నెంబర్ రికార్డు చేసుకోవడం తప్పసరి చేస్తూ నగర పోలీసు విభాగం నిర్ణయం తీసుకుంది. ఓ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ జారీ అయితే వారి ఆధార్ నెంబర్లు సేకరించరు. కేవలం అరెస్టు అయిన వారివి మాత్రమే తీసుకుంటున్నారు. అదీ ప్రతి కేసులోనూ కాకుండా సొత్తు సంబంధ నేరాలు, మోసాలతో పాటు హత్య, హత్యాయత్నం తదితర వాటిలో నిందితుల నుంచే సేకరిస్తున్నారు. ఈ నిందితుల ఆధార్ సంఖ్యల డేటాబేస్‌ను ఆన్లైన్ లో ఉంచి సర్వర్‌తో అనుసంధానిస్తున్నారు. పోలీసు యాప్స్ ద్వారా అన్ని ఠాణాలకు అందు బాటులోకి తీసుకొచ్చారు. ఫలితంగా ఓ వ్యక్తి వేర్వే రు కేసుల్లో చిక్కినప్పుడుతప్పుడు వివరాలు చెప్పే ఆస్కారంఉండట్లేదు.తదుపరి విచారణలు, పోలీ సు వెరిఫికేషన్లు సైతం పక్కాగాజరుగుతున్నాయి. -
‘డేటా బేస్డ్’ వ్యూహాలే!
వివిధ దేశాల్లో ఎన్నికల వ్యూహాల తయారీకి ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా (సీఏ) సంస్థ దుర్వినియోగం చేసిన నేపథ్యంలో.. భారత్ లో ఎన్నికల సందర్భంగా ప్రచార వ్యూహాలు ఏ విధంగా రూపొందిస్తారు? ఇందుకు ప్రజల నుంచి సమాచారాన్ని ఎలా సేకరిస్తారు? దీన్ని సమీక్షించి ప్రచారరూపాలుగా మళ్లీ ప్రజల్లోకి పార్టీలు ఎలా తీసుకెళ్తున్నాయనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలవ్యూహాలపై చర్చ మొదలైంది. డేటాదే కీలక పాత్ర సామాజిక మాధ్యమాలతోపాటు వివిధ రూపాల్లో ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి, ఎన్నికల సందర్భంగా చర్చకు వచ్చే అంశాలు, సమస్యలు, ఓటర్ల మొగ్గును బట్టి కొన్ని సంస్థలు పార్టీల కోసం ప్రచార వ్యూహాలు రూపొందిస్తాయి. భారత్‌లోనూ సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగిన నేపథ్యంలో ప్రజల నుంచి సేకరించే వివరాలను ఏ విధంగా ఉపయోగిస్తారనేది కీలకం. ప్రధానంగా పార్టీలు, సంస్థలు భారత జనాభా లెక్కల సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ డేటా విషయంలో ఎన్నికల సంఘం విడుదల చేసే వార్డు స్థాయిలో వివిధ పార్టీలకు పడిన ఓట్ల వివరాలు ముఖ్యభూమికను పోషిస్తున్నాయి. వీటి ఆధారంగా ఓటర్ల మనోభావాలు, ఎన్నికల అంశాలు వెల్లడవుతాయి. బీజేపీకి సొంత టీమ్ పార్టీ ఎన్నికల వ్యూహానికి సంబంధించి, ఓటర్ల డేటాను విశ్లేషించేందుకు బీజేపీ సొంతంగా తన బృందాన్ని వినియోగిస్తోంది. ఈ జాతీయ సమాచార, సాంకేతిక విభాగానికి అమిత్ మాలవీయ నేతృత్వం వహిస్తున్నారు. అంకెల రూపంలోని ఓటర్ల సమాచారంతో పోలింగ్‌బూత్ స్థాయిలో తమ బృందం పనిచేస్తుందని, దీనిపై విశ్లేషణ కుదిరాక పార్టీ రాజకీయ వ్యూహం ఖరారు చేస్తుందని మాలవీయ చెప్పారు. గత ఎన్నికల్లో ఇలాంటి విశ్లేషణతో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా 543 నియోజకవర్గాల్లోని 11.36 లక్షల పోలింగ్ బూత్‌లలో 81 కోట్ల ఓటర్లు లక్ష్యంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్‌కి కూడా..: కాంగ్రెస్‌కూ జాతీయస్థాయిలో ఎన్నికల ప్రక్రియ, డేటా పర్యవేక్షణ, విశ్లేషణకూ ఓ టీం ఉంది. పొలిటికల్ ఎకానమిస్ట్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో డేటా విశ్లేషణ విభాగాన్ని నియమించారు. ఎన్నికల సమాచారంతో పాటు పార్టీ కార్యకర్తలు సేకరించిన వివరాలు, పబ్లిక్ డేటాను తమ బృందం విశ్లేషిస్తుందని ప్రవీణ్ పేర్కొన్నారు. బహిరంగ సమాచారమూ ముఖ్యమే 2019 ఎన్నికల్లో 90 కోట్లకు పైగా ఓటర్లు పాలుపంచుకోనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్, జనాభా లెక్కలు, జాతీయ శాంపిల్ సర్వే సంస్థ సేకరించి, విడుదల చేసిన సమాచారానికి అనుగుణంగానే విశ్లేషణ చేపడుతున్నట్లు ఆస్ట్రమ్ సంస్థ వ్యవస్థాపకుడు అశ్వినీ సింగ్లా చెప్పారు. ఒక్కో ఓటరు ఆలోచనా ధోరణి, అభిప్రాయాలతో ఉండడంతో పాటు భాషా, కులం, సామాజిక, ఆర్థిక స్థాయిల్లో అంతరాలు వంటి అంశాలతో భారత్‌లో పరిస్థితి సంక్షిష్టంగా మారిందని.. తమ బృందం సేకరించిన డేటా ఆధారంగా పంచాయతీ నుంచి సాధారణ ఎన్నికల వరకు సరళిని అంచనా వేస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో మోదీ విజయానికి కృషి చేసినట్టు పేర్కొన్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కాంట్రాక్టు రైల్వే కార్మికుల వివరాల క్రోడీకరణ
న్యూఢిల్లీ: రైల్వేలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వివరాలు క్రోడీకరించాలని ఆ శాఖ నిర్ణయించింది. హౌస్ కీపింగ్, క్లీనింగ్, కన్సల్టెన్సీ, ట్రైనింగ్ తదితర సర్వీసుల్లో పనిచేస్తున్న కార్మికులకు వ్యవస్థీకృత రంగ ప్రయోజనాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కార్మికుల హక్కుల ఉల్లంఘనపైనా దీని ద్వారా దృష్టి సారించవచ్చని భావిస్తోంది. ఈ మేరకు జనరల్ కండీషన్స్ ఆఫ్ కాంట్రాక్టు (జీసీసీ) నిబంధనలు రూపొందించింది. ఆ ప్రకారం వంతెనలు, భవనాలు, గేజ్ మార్పిడి ప్రాజెక్టులు, ఇతర సేవలకు సంబంధించిన పనుల్లో నిమగ్నమైన కాంట్రాక్టర్ల నియమాలను మార్చనుంది. కొత్త విధానం ప్రకారం.. రైల్వేకు సేవలందిస్తున్న కాంట్రాక్టు కార్మికుల వివరాల కోసం డిజిటల్ కాంట్రాక్టు లేబర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. కార్మికుల వ్యక్తిగత వివరాలు, పోలీస్ వెరిఫికేషన్, ఆరోగ్య బీమా, పీఎఫ్ రిజిస్ట్రేషన్, గుర్తింపు కార్డు, హాజరు సమాచారం, పని వేళలు, జీతం, కార్మికుల బయోమెట్రిక్ వివరాలను ఇందులో పొందుపరచనున్నారు. -
ఆధార్ నంబర్ భేష్
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ న్యూఢిల్లీ: ఆధార్‌పై కేంద్ర హోంశాఖ తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజల్లోకి వెళ్లేందుకు ఆధార్ చక్కగా ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ మేరకు తాజాగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఒక వ్యక్తి సమస్త వివరాలను క్రోడీకరించి డాటాబేస్ నిర్వహించడంపై యూపీఏ ప్రభుత్వ హయాంలో హోంశాఖ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఆధార్ నమోదుకు ప్రజలు అనేక గుర్తింపు పత్రాలు అందజేయాల్సి రావడంపైనా అభ్యంతరం తెలిపింది. అయితే ఇప్పుడు హోంశాఖ తన వైఖరిపై యూటర్న్ తీసుకోవడం గమనార్హం. ‘ఆధార్ సార్వత్రిక గుర్తింపుగా ఉపయోగపడుతుంది. నిరుపేదలు బ్యాకింగ్ సేవలు పొందేందుకు దోహదపడుతుంది. ఆధార్‌లో బయోమెట్రిక్ విధానాన్ని మోసాలను అరికట్టవచ్చు. ఆన్లైన్లో టికెట్ల బుకింగ్‌కు, పాస్‌పోర్టు దరఖాస్తుకు, పలుచోట్ల గుర్తింపునకు.. ఇలా ఆధార్ సంఖ్యతో బహుళ ప్రయోజనాలు పొందవచ్చు’ అని పేర్కొంది. -
19న ఇంటివద్దే ఉండండి
►సర్వే ద్వారా జిల్లా ‘డాటా బేస్’ తయారు ►ఈ వివరాల ప్రకారమే జిల్లాకు పథకాలు,బడ్జెట్ కేటాయింపు ►ఆ రోజు ఏ ఇల్లూ డోర్ లాక్ చేయొద్దు ► అందుబాటులో ఉన్నవారు సమగ్రమైన వివరాలివ్వాలి ►'సాక్షి’తో కలెక్టర్ చిరంజీవులు సాక్షిప్రతినిధి, నల్లగొండ :రాష్ర్ట ప్రభుత్వం చేపట్టనున్న ఒకరోజు సర్వేకు సబంధించి శుక్రవారం సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చిరంజీవులు పాల్గొన్నారు. ఆ వివరాలు ఆయన ‘సాక్షి’కి తెలియజేశారు. జిల్లాలోని 9.50 లక్షల కుటుంబాల పూర్తి వివరాలను సర్వే ద్వారా సేకరించనున్నామని, మొత్తంగా 35.50 లక్షల జనాభా కవర్ అవుతారని వివరించారు. దీనికి 25 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున 38వేల మంది సిబ్బంది అవసరం అవుతున్నారని, వీరిని పర్యవేక్షించేందుకు సూపర్వైజర్లు, ఇతరత్రా అంతా కలిపి 40వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సర్వేలో పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 19న జరిపే సర్వే ద్వారా సేకరించిన సమాచారంతో 15 రోజుల్లో ‘డాటా ఎంట్రీ’ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఈ డాటా ఆధారంగానే జిల్లాలో అమలు చేయాల్సిన పథకాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని తెలిపారు. ఈ విధంగా చూస్తే సర్వేకు అత్యంత ప్రాధాన్యం ఉందని, జిల్లా ప్రజలంతా సర్వేలో పాల్గొని పూర్తి వివరాలు తెలియజేయాలని కలెక్టర్ చిరంజీవులు జిల్లా ప్రజలకు పిలుపు ఇచ్చారు. సీఎంతో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కొన్ని సూచనలు కూడా చేశారు. సర్వే ఫార్మాట్లో ఉన్న కొన్ని లోపాలను, ముఖ్యంగా బ్యాంకు అకౌట్‌నంబర్లు, భూముల వివరాలు వంటి వాటిని సరిచేయాలని సూచించారు. -
కిరాయిదారులపై నిఘా
సైబరాబాద్ సీపీసాక్షి, సిటీబ్యూరో: 2007 ఆగస్టు, 2013 ఫిబ్రవరి... ఉత్తరాది నుంచి వచ్చిన ముగ్గురు ముష్కరులు హబ్సిగూడ, అబ్దుల్లాపూర్‌మెట్‌ల్లో మకాం పెట్టారు... లుంబినీపార్క్, గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్‌ల్లో బాంబులు పేల్చి 59 మందిని బలి తీసుకున్నారు... ముంబై మోడల్ని ఈవెంట్ పేరుతో తీసుకువచ్చిన దండుగులు నిజాంపేట్‌లోని ఇంట్లో బంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాల్ని పరిగణలోకి తీసుకున్న సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ టెనెంట్స్ వాచ్ (అద్దెకుండే వారిపై నిఘా) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవీ విధి విధానాలు... ‘టెనెంట్స్ వాచ్ ఫామ్’ దరఖాస్తుల్ని ముద్రించి అన్ని ఠాణాల్లో అందుబాటులో ఉంచుతారు. ఇంటి యజమానులంతా వీటిని తీసుకోవాలి. తమ ఇంట్లో అద్దెకుండే వారి పూర్తి వివరాలు నమోదు చేసి, వారి గుర్తింపు పత్రాలతో పాటు ఫొటోలనూ జత చేసి పోలీసు స్టేషన్లో అప్పగించాలి. ఈ అంశాన్ని మరింత సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రచారం నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క స్థానిక ఇన్స్పెక్టర్లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తన పరిధిలో టెనెంట్స్ వాచ్ అమలును తనిఖీ చేయాలి. కేవలం వివరాలు సేకరించి వదిలిపెట్టకుండా ఫొటోలతో సహా టెనెంట్స్ డేటాబేస్ రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో సైబరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అద్దెకున్న వారి వివరాలన్నీ సెంట్రల్ సర్వర్‌లో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని, దీన్ని పోలీసు విభాగం వినియోగించే ఇంట్రానెట్‌కు కనెక్ట్ చేస్తారు. శివార్లలో కాలేజీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు ఐటీ హబ్‌లోనూ టెనెంట్స్ వాచ్ తప్పనిసరి చేసి ఉల్లంఘించిన ఇంటి యజమానులపై చర్యలకు అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఈ టెనెంట్స్‌వాచ్ అమలుతో ముష్కరులకు షెల్టర్ దొరక్కుండా చేయడంతో పాటు ఏదైనా జరగరానిది జరిగినప్పుడు దర్యాప్తు తేలికవుతుందని అధికారులు భావిస్తున్నారు. -
కిరాయిదారులపై నిఘా
అద్దెకుండే వారి వివరాలతో డేటాబేస్ ముష్కరుల ఆగడాలకు చెక్ చెప్పేందుకే ఠాణాల వారీగా వివరాల సేకరణకు నిర్ణయం ప్రణాళికలు సిద్ధం చేసిన సైబరాబాద్ సీపీ సాక్షి, సిటీబ్యూరో: 2007 ఆగస్టు, 2013 ఫిబ్రవరి... ఉత్తరాది నుంచి వచ్చిన ముగ్గురు ముష్కరులు హబ్సిగూడ, అబ్దుల్లాపూర్‌మెట్‌ల్లో మకాం పెట్టారు... లుంబినీపార్క్, గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్‌ల్లో బాంబులు పేల్చి 59 మందిని బలి తీసుకున్నారు... ముంబై మోడల్ని ఈవెంట్ పేరుతో తీసుకువచ్చిన దండుగులు నిజాంపేట్‌లోని ఇంట్లో బంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాల్ని పరిగణలోకి తీసుకున్న సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ టెనెంట్స్ వాచ్ (అద్దెకుండే వారిపై నిఘా) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవీ విధి విధానాలు... ‘టెనెంట్స్ వాచ్ ఫామ్’ దరఖాస్తుల్ని ముద్రించి అన్ని ఠాణాల్లో అందుబాటులో ఉంచుతారు. ఇంటి యజమానులంతా వీటిని తీసుకోవాలి. తమ ఇంట్లో అద్దెకుండే వారి పూర్తి వివరాలు నమోదు చేసి, వారి గుర్తింపు పత్రాలతో పాటు ఫొటోలనూ జత చేసి పోలీసు స్టేషన్లో అప్పగించాలి. ఈ అంశాన్ని మరింత సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రచారం నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క స్థానిక ఇన్స్పెక్టర్లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తన పరిధిలో టెనెంట్స్ వాచ్ అమలును తనిఖీ చేయాలి. కేవలం వివరాలు సేకరించి వదిలిపెట్టకుండా ఫొటోలతో సహా టెనెంట్స్ డేటాబేస్ రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో సైబరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అద్దెకున్న వారి వివరాలన్నీ సెంట్రల్ సర్వర్‌లో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని, దీన్ని పోలీసు విభాగం వినియోగించే ఇంట్రానెట్‌కు కనెక్ట్ చేస్తారు. శివార్లలో కాలేజీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు ఐటీ హబ్‌లోనూ టెనెంట్స్ వాచ్ తప్పనిసరి చేసి ఉల్లంఘించిన ఇంటి యజమానులపై చర్యలకు అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఈ టెనెంట్స్‌వాచ్ అమలుతో ముష్కరులకు షెల్టర్ దొరక్కుండా చేయడంతో పాటు ఏదైనా జరగరానిది జరిగినప్పుడు దర్యాప్తు తేలికవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఠాణాల వారీగా వివరాల సేకరణ... నగరానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందంటూ నిఘా వర్గాల నుంచి తరచు హెచ్చరికలు అందుతూనే ఉన్నాయి. మరోపక్క ఇతర ప్రాంతా లు, రాష్ట్రాల నుంచి వస్తున్న దృష్టి మరల్చి చోరీలు చేసే ముఠాలు, దోపిడీ దొంగలకూ అద్దె ఇళ్లే అడ్డాలు గా మారుతున్నాయి. ఇలా వస్తున్న ముష్కరులకు షెల్టర్ దొరక్కుండా చేయాలనే ఉద్దేశంతోనే సైబరాబాద్ పోలీసులు ఈ టెనెంట్స్ వాచ్‌ను అమలు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో 41 శాంతి భద్రతల ఠా ణాలకు ఈ బాధ్యతల్ని అప్పగించనున్నారు. టెనెం ట్స్ వాచ్‌కు సంబంధించిన విధి విధానాలను సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రూపకల్పన చేస్తున్నారు. డిజైన్ సిద్ధం చేశాం.... ముష్కరమూకలతో పాటు అసాంఘికశక్తులకు చెక్ చెప్పే చర్యల్లో భాగంగా టెనెంట్స్ వాచ్‌ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి న విధి విధానాల డిజైన్‌ను పూర్తి చేశాం. ప్రస్తుతం దీనికి తుదిమెరుగులు దిద్దుతున్నాం. పూర్తిస్థాయి స్వరూపం వచ్చాక ఠాణా ల వారీగా త్వరలోనే అమలు చేస్తాం. అద్దెకుండే వారి వివరాల సేకరణను తప్పనిసరి చేస్తాం. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్