ఆధార్‌పై కేంద్ర హోంశాఖ తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. ప్రభుత్వ పథకాలు, ...
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: ఆధార్‌పై కేంద్ర హోంశాఖ తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజల్లోకి వెళ్లేందుకు ఆధార్ చక్కగా ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ మేరకు తాజాగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఒక వ్యక్తి సమస్త వివరాలను క్రోడీకరించి డాటాబేస్ నిర్వహించడంపై యూపీఏ ప్రభుత్వ హయాంలో హోంశాఖ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఆధార్ నమోదుకు ప్రజలు అనేక గుర్తింపు పత్రాలు అందజేయాల్సి రావడంపైనా అభ్యంతరం తెలిపింది.
అయితే ఇప్పుడు హోంశాఖ తన వైఖరిపై యూటర్న్ తీసుకోవడం గమనార్హం. ‘ఆధార్ సార్వత్రిక గుర్తింపుగా ఉపయోగపడుతుంది. నిరుపేదలు బ్యాకింగ్ సేవలు పొందేందుకు దోహదపడుతుంది. ఆధార్‌లో బయోమెట్రిక్ విధానాన్ని మోసాలను అరికట్టవచ్చు. ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌కు, పాస్‌పోర్టు దరఖాస్తుకు, పలుచోట్ల గుర్తింపునకు.. ఇలా ఆధార్ సంఖ్యతో బహుళ ప్రయోజనాలు పొందవచ్చు’ అని పేర్కొంది.