వాట్సాప్‌కు భారీ దెబ్బ..! | Whatsapp Faces Proceedings In Russia Over Violation Of Personal Data Law | Sakshi
Sakshi News home page

WhatsApp : వాట్సాప్‌కు భారీ దెబ్బ..!

Published Sat, Jul 31 2021 3:25 PM | Last Updated on Sat, Jul 31 2021 7:54 PM

Whatsapp Faces Proceedings In Russia Over Violation Of Personal Data Law - Sakshi

మాస్కో: ప్రముఖ సోషల్‌ మీడియా మెసేంజర్‌ వాట్సాప్‌కు రష్యాలో భారీ దెబ్బ తగిలింది. రష్యా ప్రభుత్వం సుమారు మూడు మిలియన్ల రూబెల్స్‌ను వాట్సాప్‌పై జరిమానా విధించనుంది. రష్యా దేశ నియమాలను ఉల్లఘించినందుకు వాట్సాప్‌పై జరిమానా విధించినట్లు తెలుస్తోంది. రష్యా భూభాగంలో రష్యన్ వినియోగదారుల డేటాను స్థానికీకరించడంలో వాట్సాప్‌ విఫలమైంది. వాట్సాప్‌పై తగు చర్యలు తీసుకోవడానికి రష్యా ప్రభుత్వం సిద్ధమైంది.

త్వరలోనే రష్యా ప్రభుత్వం వాట్సాప్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ప్రొసీడింగ్‌లను ప్రారంభించే అవకాశం ఉందని స్థానిక న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. కాగా ఈ విషయంపై ఫేస్‌బుక్‌ స్పందించలేదు. కొద్దిరోజుల క్రితమే గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్‌పై కూడా రష్యా ప్రభుత్వం 3 మిలియన్ల రూబిళ్లను జరిమానా విధించింది. వ్యక్తిగత డేటా చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను రష్యన్‌ కోర్టు ఫేస్‌బుక్‌, ట్విటర్‌పై కూడా జరిమానాను విధించింది. రష్యా అడ్మినిస్ట్రేటివ్‌ దిగ్గజ కంపెనీలపై జరిమానాలను విధించడం గత కొన్ని రోజుల నుంచి నడుస్తూనే ఉంది. వాట్సాప్‌కు ఒక మిలియన్ లేదా 6 మిలియన్ రూబిళ్ల నుంచి జరిమానా విధించవచ్చునని ఇంటర్‌ ఫాక్స్‌ తన నివేదిక పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement