
ఇండియన్ రైల్వేస్ ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపేందుకు కొత్త నిర్ణయం తీసుకుంది. రైలు లేదా గూడ్సులో చివరి పెట్టెలో తెల్లని డ్రెస్‌లో ఉంటూ ఎరుపు, పచ్చా జెండాలు ఊపుతూ కనిపించే గార్డు పోస్టుల్లో మార్పులు చేసింది. ఇకపై వారిని గార్డుల స్థానంలో ట్రైన్ మేనేజర్లుగా డిజిగ్నేషన్ మారుస్తూ రైల్వేశాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 13న రైల్వే బోర్డు అన్ని జోన్లకి సర్క్యులర్ జారీ చేసింది.
రైల్వేబోర్డు తాజాగా చేసిన మార్పులతో ఇకపై నుంచి అసిస్టెంట్ గార్డ్‌ని అసిస్టెంట్ ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్, గూడ్స్ గార్డుని గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ గూడ్సు గార్డుని సీనియర్ గూడర్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ ప్యాసింజర్ గార్డుని సీనియన్ ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్, మెయిల్/ఎక్స్‌ప్రెస్ గార్డుని మెయిల్/ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మేనేజర్‌గా హోదాలు మార్చింది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత మార్పులు కేవలం హోదా వరకే అని విధులు, జీతం, ప్రమోషన్లలో ఎటువంటి మార్పులు లేవని రైల్వేబోర్డు స్పష్టం చేసింది.
చదవండి: ఐఆర్‌సీటీసీ ఫీజులో వాటాలపై వెనక్కి తగ్గిన రైల్వేస్..
Comments
Please login to add a commentAdd a comment